వీచేనో ప్రేమపవనం తన వధువు కోసం | Telugu Christian Wedding Song Lyrics
Lyrics: Telugu
వీచేనో ప్రేమపవనం తన వధువు కోసం
విరిసెనో తేనె కుసుమం తన వరుని కోసం
మీ పరిణయం అనురాగ సంగమం కావాలని
దేవ దేవుడే దీవించే ఈ ఘడియలో మికోసమని
మేళతాళాల కళ్యాణ వైభోగమే ఓ.. ఓ.. ఓ..
బంధుమిత్రుల ఆనంద సంబరమే ఓ.. ఓ.. ఓ..
ఆహాహ పండగే సందడులే చేయుదమూ
ఓహోహో మురియుచూ దేవుని స్తుతింతుమూ
|| వీచేనో ||
1. ప్రేమ బంధాల గంధాలు కురిసెనే ఈ క్షణం
తీపి రాగాల వెల్లువలై తడిసెనే హృదయమే
నిత్య కళ్యాణ దివెనై దైవమే కలిపే మీ జంటను
ఆకు వాడని ఫలవృక్షమై ఎదిగి పోవాలి ఏకమై
తోడుగా ఉండును ఆ ప్రభువే ఆత్మగా
|| మేళతాళాల ||
2. వేల వర్ణాల స్వప్నాలు మెరిసెనే కళ్ళలో
కోటికిరణాల దీపాలు వెలిగెనే గృహములో
క్రిస్తే మిసౌధ కేద్రమై సాగిపోవాలి నిత్యము
నరుడు వేరుచేయని జంటగా కలిదసిపోవాలి
చిరునవ్వులే వెదికై వేడుకవ్వాలి మిజీవితం
|| మేళతాళాల ||
Veecheno Premapavanam | Telugu Christian Wedding Song Lyrics
Lyrics: English
Veecheno premapavanam thana vadhuvu kosam
Viriseno tene kusumam tana varuni kosam
Mee parinayam anuraaga sangamam kaavaalani
Deva Devude deevinche ee ghadiyalo meekosamani
Melataalaala kalyaana vaibhogame O… O… O…
Bandhu mitrula aananda sambarame O… O… O…
Aahaaha pandage sandadule cheyudamoo
Ohoho muriyuchoo Devuni stutintumoo
|| Veecheno ||
1 Charanam
Prema bandhaala gandhaalu kurisene ee kshanam
Teepi raagaala velluvalai tadisene hrudayame
Nitya kalyaana deevenai Daivame kalipe mee jantanu
Aaku vaadani phalavrukshamai edigi povaali ekamai
Todugaa undunu aa Prabhuve aatmagaa
|| Melataalaala ||
2 Charanam
Vela varnaala swapnaalu merisene kallalo
Kotikiranaala deepaalu veligene gruhamulo
Kreeste mee soudha kendramai saagipovaali nityamu
Narudu verucheyani jantagaa kalisi saagipovaali
Chirunavvule vedikai vedukavvaali mee jeevitam
|| Melataalaala ||