కళ్యాణ రాగం | A R Stevenson | Telugu Christian Marriage Song
Lyrics: Telugu
కళ్యాణరాగం సాగింది మంగళవాద్యం మ్రోగింది (2)
పరమందలి నిర్ణయం ఇల నేటి పరిణయం (2)
తలిదండ్రుల విడచిన వీరిరువురు
హత్తుకొని ఒక్కటే శరీరమైయుందురు (2)
|| కళ్యాణరాగం ||
1. ప్రక్కటెముకను స్త్రీనిగా ఇల్లు చక్కబెట్టుటకు భార్యగా
భర్తకనుగ్రహించేను సరియైన తోడుగా (2)
లోబడియుండుమని అన్నింటా పూర్తిగా (2)
నడుపుకోవాలని సంసారం తెలివిగా (2)
|| తలిదండ్రుల ||
2. ఇంటిపైన యజమానిగా ప్రేమ పంచిపెట్టుటకు భర్తగా
బాధ్యతప్పగించెను పురుషునికి మోయగా (2)
లోగిట అందరిని పోషించి బాగుగా (2)
భక్తిలో పెంచాలని సంతోషం విరియగా (2)
|| తలిదండ్రుల ||
3. ఇన్నినాళ్ళ ఆశ తీరగా నేడు కన్నకల నిజమవ్వగా
పాట ప్రతిధ్వనించెను హృదయాలు పొంగగా (2)
దేవుని సన్నిధిని ప్రార్దించి నేరుగా (2)
కలిమి పొందాలని సంగీతం పలుకగా (2)
|| తలిదండ్రుల ||
KALYAANA RAAGAM | A R Stevenson | Telugu Christian Marriage Song
Lyrics: English
Kalyana raagam saagindi
mangala vaadyam mrogindi (2)
Paramandali nirnayam ila neti parinayam (2)
Talidandrula vidachina veeriruvuru
Hattukoni okkate shareeramai yunduru (2)
|| Kalyana raagam ||
1 Charanam
Prakkatemu kanu streenigaa
illu chakkabettutaku bhaaryagaa
Bhartakanugrahinchenu sariyaina toodugaa (2)
Lobadiyundumani annintaa poorthigaa (2)
Nadupukovaalani samsaaram telivigaa (2)
|| Talidandrula ||
2 Charanam
Intipaina yajamaanigaa prema
panchipettutaku bhartagaa
Baadhyata appaginchenu purushuniki moyagaa (2)
Logita andarini poshinchi baagugaa (2)
Bhaktilo penchaalani santosham viriyagaa (2)
|| Talidandrula ||
3 Charanam
Inninaalla aasha teeragaa
nedu kanna kala nijamavvagaa
Paata pratidhvaninchenu hrudayaalu pongagaa (2)
Devuni sannidhini praarthinchi nerugaa (2)
Kalimi pondaalani sangeetam palukagaa (2)
|| Talidandrula ||