హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
నిలచి – సదయుడగుచు దట్టుచుండు
సకల విధములను (2) ||హృదయ||
1. పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ
నతడు – పరుడు గాడు రక్షకుండు
ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ||
2. కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప
గరము న్యాయంబు (2) ||హృదయ||
3. ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా
డిప్పుడు మిమ్ములను (2) ||హృదయ||
4. అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని
యతడు ప్రియుడగును (2) ||హృదయ||
5. జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి
యనిశము కనిపెట్టు (2) ||హృదయ||
6. సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల
సూటిగ రక్షించు (2) ||హృదయ||
7. చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును
చీర జీవము కృపను (2) ||హృదయ||
8. అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు
డానందము తోడ (2) ||హృదయ||
9. బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే
ప్రభుని గొలువండి (2) ||హృదయ||
Hrudayamanedu talupu nodda – Yesu Naathundu | Telugu Christian Song Lyrics
Lyrics: English
Hrudayamanedu talupu nodda – Yesu Naathundu
Nilachi – sadayudaguchu dattuchundu
Sakala vidhamulanu (2) || Hrudaya ||
1. Paruni boli niluchunnadu – parikinchi chooda
Natadu – parudu gaadu Rakshakundu
Praana snehitudu (2) || Hrudaya ||
2. Karunaa sheelundatadu gaana – gaachi yunnadu
Yesu – karuna nerigi gaaravimpa
Garamu nyaayambu (2) || Hrudaya ||
3. Entha sepu niluva betti – yedpintu ratani
Naata – dento dayache biluchuchunna
Dippudu mimmulanu (2) || Hrudaya ||
4. Atadu mitrudatadu mitrun – dakhila paapulaku
Meera – latani pilupu vinti rēni
Yatadu priyudagunu (2) || Hrudaya ||
5. Jaali cheta dana hastamula – jaapi yunnadu
Mimmu – naalinganamu seya gori
Anishamu kanipettu (2) || Hrudaya ||
6. Saatileni dayagala vaadu – Sarveshu sutudu
Tana – maata vinedu vaarala nella
Sootiga rakshinchu (2) || Hrudaya ||
7. Cherchukonudi mee hrudayamuna – Sri Yesunaathu
Natadu – cherchukonuchu mee kichchunu
Cheera jeevamu krupanu (2) || Hrudaya ||
8. Atadu tappaka kalugajeyu – nakhila bhaagyamulu
Meera – latani hattukondu rappu
Daanandamu toda (2) || Hrudaya ||
9. Bratuku shaashvatambu kaadu – parikinchu choodu
Gaana – bratiki yundu kaalamunane
Prabhuni goluvandi (2) || Hrudaya ||