కరుణ కటాక్షము గల యేసయ్య |  Karuna Katakshamu | Pas Freddy Paul | Hosanna Ministries 2026


కరుణ కటాక్షము గల యేసయ్య
నను విస్తరింపజేయు మహనీయ  (2)
దివ్య సుందరమా దయకు నిలయమా
దివిలో కాంతి తేజమా
పరిమళ నామమా ప్రేమకు నిలయమా
పరిశుద్ధ స్తుతి గానమా (2) || కరుణా కటాక్షము ||

1. ఏమున్నదని నాపై లక్ష్యముంచినావు
ఆదరించి ప్రేమించి కటాక్షించినావు  (2)
నీ రెక్కల నీడే సురక్షితం
నీ పాద సన్నిధే క్షేమము (2)
కృప వెంబడి కృపను నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేశావు (2)
                                          || కరుణా కటాక్షము ||
2. నేనెంతటి వాడనని ఇంతగా హెచ్చించావు
ఏలుటకు ఎన్నుకొని అభిషేకించావు  (2)
నీ ఇష్టునిగా నివసించెదను
నీ ఉద్దేశము నే మరువను (2)
కృప వెంబడి కృపను నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేశావు (2)
                                          || కరుణా కటాక్షము ||
3. ఏ యోగ్యత లేని నాకు తోడుగా నిలిచావు
నింద అవమానములో ఘనతనిచ్చినావు  (2)
నీ నడిపింపుకు లోబడితిని
నీ స్వాస్థ్యమునకై వేచియుంటిని (2)
కృప వెంబడి కృపను నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేశావు (2)
                                          || కరుణా కటాక్షము ||


Karuna Katakshamu | Pas Freddy Paul | Hosanna Ministries 2026

Karunaa kataakshamu gala Yesayya
Nanu vistharimpajeyu mahaneeya (2)
Divya sundaramaa dayaku nilayamaa
Divilo kaanti tejamaa
Parimala naamamaa premaku nilayamaa
Parishuddha stuti gaanamaa (2)
|| Karunaa kataakshamu ||

1. Emunnadani naapai lakshyamunchinaavu
Aadarinchi preminchi kataakshinchinaavu (2)
Nee rekkala neede surakshitam
Nee paada sannidhe kshemamu (2)
Krupa vembadi krupanu nityamaina premanu
Adhikamaina mahimanu vistharimpajeshaavu (2)
|| Karunaa kataakshamu ||

2. Nenentati vaadanani intagaa hechchinchaavu
Elutaku ennukoni abhishekinchaavu (2)
Nee ishtunigaa nivasinchedanu
Nee uddeshamu ne maruvanu (2)
Krupa vembadi krupanu nityamaina premanu
Adhikamaina mahimanu vistharimpajeshaavu (2)
|| Karunaa kataakshamu ||

3. Ae yogyata leni naaku todugaa nilichaavu
Ninda avamaanamulo ghanatanichchinaavu (2)
Nee nadipimpuku lobaditini
Nee swaasthyamu nakai vechiyuntini (2)
Krupa vembadi krupanu nityamaina premanu
Adhikamaina mahimanu vistharimpajeshaavu (2)
|| Karunaa kataakshamu ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *