అబ్రాహాము నమ్మిన దేవుడా | ఇశ్రాయేలు కాపరి | Ramesh Anna | Hosanna Ministries 2026
Lyrics: Telugu
అబ్రహాము నమ్మిన దేవుడా
నా పితరుల ఆరాధ్య దైవమా (2)
ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి
నీకు సాటి ఎవరు యేసయ్యా (2)
సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా
ప్రభాకరుడా బహు బలవంతుడా (2)
సత్యవంతుడా మహా పరిశుద్ధుడా
ఆరాధనకు యోగ్యుడా || అబ్రహాము ||
1. నీలి మేఘమును నీడగా మార్చి
అగ్ని స్తంభమును కాంతిగా నిలిపి (2)
సైన్యములకు నీవే సారధిగా నిలిచి
నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన (2)
మా పక్షమై ఉన్న మహారాజువు నీవే
నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా
|| సహాయకుడా ||
2. నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై
నిరాశల నీడను తొలగించెదవు (2)
విస్తారమైన నీ కృపతో నింపి
నిస్సారమైన బ్రతుకును మార్చెదవు (2)
విజయోత్సవముతో ఊరేగించెదవు
నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా
|| సహాయకుడా ||
3. సాత్వికముతో దీర్ఘ శాంతముతో
విసుగక నాయెడల వాత్సల్యము చూపి (2)
ఒంటరిగా నను ఎన్నడు విడువక
వేదనలో నను దాటి వెళ్ళక (2)
తల్లివలె ఒడిలో లాలించువాడవు
తీరని నీ ఋణము వివరింపతరమా
|| సహాయకుడా ||
Abrahaamu nammina Devudaa | Israelu kaapari | Ramesh Anna | Hosanna Ministries 2026
Lyrics: English
Abrahaamu nammina Devudaa
Naa pitarula aaraadhya daivamaa (2)
Ishraayelu kaapari bahu goppa nerpari
Neeku saati evaru Yesayya (2)
Sahaayakudaa nitya stotraarhudaa
Prabhaakarudaa bahu balavanthudaa (2)
Satyavanthudaa mahaa parishuddhudaa
Aaraadhanaku yogyudaa
|| Abrahaamu ||
1. Neeli meghamunu needagaa maarchi
Agni sthambhamunu kaanthigaa nilipi (2)
Sainyamulaku neeve saaradhigaa nilichi
Ninginantina godalu kuppagaa koolchina (2)
Maa pakshamai unna mahaaraajuvu neeve
Neeku saadhyamu kaanidi edainaa kaladaa
|| Sahaayakudaa ||
2. Niraashrayulaku neeve nityaashrayamai
Niraashala needanu tolaginchedavu (2)
Visthaaramaina nee krupatho nimpi
Nissaaramaina bratukunu maarchedavu (2)
Vijayotsavamutho ooreginchedavu
Neeku saadhyamu kaanidi edainaa kaladaa
|| Sahaayakudaa ||
3. Saatvikamuto deergha shaantamuto
Visugaka naayedala vaatsalyamu choopi (2)
Ontarigaa nanu ennadu viduvaka
Vedhanalo nanu daati vellaka (2)
Tallivale odilo laalinchuvadavu
Teerani nee runamu vivarinchataramaa
|| Sahaayakudaa ||