బెత్లెహేము ఊరిలో | Ravi Mandadi | Symonpeter | New Telugu Christmas Song 2026


Lyrics: Telugu

బెత్లెహేము ఊరిలో జన్మించెను ఇమ్మానుయేలు
సాగిలపడిరి స్తుతిగానం చేసిరి
అద్భుతకరుడు ఆలోచన కర్త
ప్రేమస్వరూపుడు సమాధాన ప్రభువు (2)

పరిశుద్ధుడు జనియించే — హల్లెలూయా
పరలోకము సంతోషించే — హల్లెలూయా
హల్లెలూయా!  హల్లెలూయా!
సర్వోన్నతునికే మహిమ, హల్లెలూయా!
హల్లెలూయా!  హల్లెలూయా!
యుగయుగములకు మహిమ హల్లెలూయా!
                                        || బెత్లెహేము ||
1. దావీదు పురమున దివ్యజ్యోతి వెలిగెను
దేవుని వాక్యమే శరీరదారియాయెను (2)
కన్య గర్భమందు కృప పరిపూర్ణమాయెను
యెహోవా వాగ్దానము నిత్యం నెరవేరెను (2)
                                       || పరిశుద్ధుడు ||
2. తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రము చూచిరి
బంగారు సాంబ్రాణి బోళములు తెచ్చిరి (2)
మోకరిల్లి రాజునకు ఆరాధన చేసిరి
యుగయుగాల రాజును మహిమపరచిరి (2)
                                       || పరిశుద్ధుడు ||


Bethlehemu Oorilo | Ravi Mandadi | Symonpeter | New Telugu Christmas Song 2026

Lyrics: English

Bethlehemu oorilo janminchenu Immaanuyelu
Saagilapadiri sthuthigaanam chesiri
Adbhuthakarudu aalochana kartha
Prema swaroopudu samaadhaana Prabhuvu (2)

Parishuddhudu janiyinche — Halleluyaa
Paralokamu santhoshinche — Halleluyaa
Halleluyaa! Halleluyaa!
Sarvonnathunike mahima, Halleluyaa!
Halleluyaa! Halleluyaa!
Yugayugamulaku mahima Halleluyaa!
|| Bethlehemu ||

1. Daaveedu puramuna divya jyothi veligenu
Devuni vaakyame shareeradhaariy aayenu (2)
Kanya garbhamandu krupa paripoornamaayenu
Yehova vaagdaanamu nithyam neraverenu (2)
|| Parishuddhudu ||

2. Thoorpu desha gnaanulu nakshathramu choochiri
Bangaaru saambraani bolamulu thechchiri (2)
Mokarilli raajunaku aaraadhana chesiri
Yugayugaala raajunu mahimaparachiri (2)
|| Parishuddhudu ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *