ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే | Ghanudavu Neve | Pastor Sagar | Telugu Christian Song
Lyrics: Telugu
ఘనుడవు నీవే – పరిశుద్ధుడవు నీవే (2)
నీ మమతల అనురాగం – నా నోట స్తుతిగానం
నీవు చేసిన వాగ్దానం – నా జీవిత ఆధారం
ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము
నేనెలా దాచనయ్యా నే పొందిన విజయమూ (2)
|| ఘనుడవు నీవే ||
1. విలువైనది నీ వదనము – సాటిలేని తేజము
ఘనమైనది నీ వాక్యము – శాశ్వత జీవము (2)
నీ ప్రేమే మధురము – నీ మాటే మకరందము
నీ చూపే వాత్సాల్యము – నీ మనసే ఉన్నతము
ఎలా మరువనయ్యా నీవు చూపిన ప్రేమను –
నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలనూ (2)
|| ఘనుడవు నీవే ||
2. శ్రమ లోయలో గుండె చెదరగా – నిలిచినావు తోడుగా
కన్నీళ్ళలో కృంగియుండగా – చూపినావు నీ కృప (2)
నే పొందిన శ్రమలలో – నా దీవెన దాచావు
నే కార్చిన కన్నీటిలో – నీ దర్శన మిచ్చావు
ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును –
నేనెలా తీర్చనయ్య నీదూ ఋణమునూ (2)
|| ఘనుడవు నీవే ||
3. అడుగడుగున అవమానమే – మోయలేని భారమే
ప్రతి క్షణమున యెడబాయక- వెంట నిలిచే దైవమా (2)
పరిచర్యే ప్రాణమై – నడిపినాపు ప్రగతిలో
సంఘ క్షేమమే ఊపిరై – నింపినావు మహిమతో
ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము –
నేనెలా మరతునయ్య నీవు చేసిన త్యాగమూ (2)
|| ఘనుడవు నీవే ||
Ghanudavu neeve Parishuddhudavu neeve | Pastor Sagar | Telugu Christian Song
Lyrics: English
Ghanudavu neeve – Parishuddhudavu neeve (2)
Nee mamatal anuraagam – naa nota stutigaanaam
Neevu chesina vaagdaanam – naa jeevita aadhaaram
Ela maruvanayyaa neevu chesina snehamu
Nenela daachanayya ne pondina vijayamu (2)
|| Ghanudavu neeve ||
1 Charanam
Viluvainadi nee vadanamu – saatileni tejamu
Ghanamainadi nee vaakyamu – shaashvata jeevamu (2)
Nee preme madhuramu – nee maate makarandamu
Nee choope vaatsalyamu – nee manase unnatham
Ela maruvanayyaa neevu choopina premanu
Nenela pogadanayya nee unnata krupalanu (2)
|| Ghanudavu neeve ||
2 Charanam
Shrama loyalo gunde chedaragaa – nilichinaavu toodugaa
Kanneellalo krungiyundagaa – choopinaavu nee krupa (2)
Ne pondina shramalalo – naa deevena daachaavu
Ne kaarchina kanneetilo – nee darshanam ichchaavu
Ela maruvanayyaa neevu chesina melunu
Nenela teerchanayya needu runamunu (2)
|| Ghanudavu neeve ||
3 Charanam
Adugaduguna avamaaname – moyaleni bhaarame
Prati kshanamuna edabaayaka – venta niliche Daivamaa (2)
Paricharye praanamai – nadipinaapu pragatilo
Sangha kshemame oopirai – nimpinaavu mahimato
Ela maruvanayyaa neevu nadipina maargamu
Nenela maratanayya neevu chesina tyaagamu (2)
|| Ghanudavu neeve ||