ఏ రీతి స్తుతియింతును | Thathapudi Jyothi Babu | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
ఏ రీతి స్తుతియింతును ఓ యేసూ నాథా దైవమా
ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును
నీ కృపలన్ని తలపోసుకొనుచు
నీ పాదాలు చేరానయ్యా
నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో
నా కన్నీళ్లు మిగిలాయయ్యా || ఏ రీతి ||
1. ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకు
ఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్ను
ఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యా
ఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా
|| ఏ రీతి ||
2. ఈ మనుష్యులు ఈ వైరులు – ఎన్నెన్నో చేసిన గాని
నా ప్రాణము నా దేహము – నీ స్వాధీనంభేగదయ్యా
నా స్వామి నాతోనే ఉంటూ – నా కాపరిగ నిలిచావయ్యా
నాకేమి స్పృహ లేని వేళ – ఊపిరిని పోసావయ్యా
|| ఏ రీతి ||
3. నీ ప్రేమను నీ పేరును – నేనెన్నడూ మరువలేను
నీ కరుణను నీ జాలిని – ఏ మనిషిలో చూడలేను
నిజ దైవము నీవే యనుచు – నీ వైపే నే చూచానయ్యా
యెహోవా రాఫా నేననుచు – ఈ స్వస్థతను ఇచ్చావయ్యా
|| ఏ రీతి ||
Ee Reeti Sthuthiyintunu | Thathapudi Jyothi Babu | Telugu Christian Song Lyrics
Lyrics: English
Ee reeti sthuthiyintunu
O Yesu Naathaa Daivamaa
Ee reeti varninthunu
nee prema madhurambunu
Nee krupalanni talaposukonuchu
Nee paadaalu cheraanayyaa
Neeku krutajnatalu chellimpa madilo
Naa kanneellu migilaayayyaa
|| Ee reeti ||
1 Charanam
Ekaakinai ne duhkhartilo – ae todu gaanani naaku
Emauduno etu poduno – etu tochaka nunna nannu
Ae bhayamu neekeela yanuchu – abhayambu nichchaavayyaa
Ae daari kanabadani vela – nee odilopu daachaavayyaa
|| Ee reeti ||
2 Charanam
Ee manushyulu ee vairulu – ennenno chesina gaani
Naa praanamu naa dehamu – nee swaadheenambegadayyaa
Naa Swaami naatone untu – naa kaaparigaa nilichaavayyaa
Naakemi spruha leni vela – oopirini posaavayyaa
|| Ee reeti ||
3 Charanam
Nee premanu nee perunu – nenennadoo maruvalenu
Nee karunanu nee jaalini – ae manishilo choodalenu
Nija Daivamu neeve yanuchu – nee vaipe ne choochaanayyaa
Yehovaa Raphaa nenanuchu – ee svasthatanu ichchaavayyaa
|| Ee reeti ||
