పేరుకే ఉన్నానయ్యా | Telugu Christian song


Lyrics: Telugu

పేరుకే ఉన్నానయ్యా
ప్రేమ లేని దాననయ్యా (2)
పేరు పెట్టి పిలిచినావయ్యా
ప్రేమతోనే నడిపినావయ్యా (2)
భూమికే భారమని పుట్టడమే వ్యర్థమని (2)
అవమానాలే నాకు అన్నపానాలు
అయినా నీ కృప నాకు ఉన్న చాలు (2)

1. తగిన అర్హత నాకు లేదని
తలవంచుకున్న సమయాన నీవు
తల్లి కడుపులో కనుమూసిన మేలని
కలత చెందిన సమయాన నీవు  (2)
కన్న తండ్రివై నన్ను కౌగిలించినావు
కౌగిలించి నాకు ఘనతనిచ్చినావు  (2) || పేరుకే  ||

2. కపట ప్రేమలో నటన నీడలో
మోసపోతిని చేతకాని దానిని
కరుణ కోసము ప్రేమ కోసము
పడిగాపులు గాచా పనికిరాని దానిని (2)
విలువలేని నాకై సిలువ మోసినావు
సిలువ మోసి నాకై విలువనిచ్చినావు  (2)  || పేరుకే  ||


Peruke Unnanayya | Telugu Christian song

Lyrics: English

Peruke unnaanayya
Prema leni daananayya (2)
Peru petti pilichinaavayya
Prematone nadipinaavayya (2)
Bhoomike bhaaramani puttadame vyarthamani (2)
Avamaanale naaku annapaanaalu
Ayinaa nee krupa naaku unna chaalu (2)

1. Tagina arhata naaku ledani
Talavanchukunna samayaana neevu
Talli kadupulo kanumoosina melani
Kalata chendina samayaana neevu (2)
Kanna tandrivai nannu kaugilinchaavu
Kaugilinchi naaku ghanatanichchaavu (2)
|| Peruke ||

2. Kapata premalo natana needalo
Mosapotini chetakaani daanini
Karuna kosamu prema kosamu
Padigaapulu gaachaa panikiraani daanini (2)
Viluvuleni naakai siluva mosinaavu
Siluva mosi naakai viluvanichchinaavu (2)
|| Peruke ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *