అతి శ్రేష్టమైన బంధం | Telugu Christian Wedding Song
Lyrics: Telugu
మధురం మధురం కళ్యాణ రాగం
నీ జతగా నిలిచింది అనురాగ గీతం (2)
ఆ దేవుని చిత్తమే పరిశుద్ధ పరిణయం
మేలు నేడు దొరికింది ఇక ఆనందం (2)
1. అతిమధురం ఈ సమయం
జత కలిసే శుభ తరుణం
నవ దంపతులకు నేడే సుస్వాగతం
ఒకరికి ఒకరై కలిసుండాలని
విశ్వాస ప్రేమలతో జీవించాలని
ఐక్యపరచుమయ్య నీ దివ్య కృపతో
సౌఖ్యమిచ్చి కాయుము
నీవు ఉన్నత ప్రేమతో (2)
దేవా దీవించు నేడే ఈ వధూవరులను (2)
2. ఇహలోక ఆశలు వీడాలని
చిరునవ్వుతో మీరు సాగాలని
సంసార నావ సరిగ నడపాలని
సమాధానము మీలో నిలవాలని
అతి శ్రేష్టమైన బంధం ఇది
యెహోవా కట్టిన ఇల్లే ఇది (2)
ఐక్యపరచుమయ్య నీ దివ్య కృపతో
సౌఖ్యమిచ్చి కాయుము
నీవు ఉన్నత ప్రేమతో (2)
దేవా దీవించు నేడే ఈ వధూవరులను (2)
3. వినయముతో మీరు ఎదగాలని
క్రీస్తు యేసు సాక్షులుగా ఉండాలని
పరలోక దీవెనలు కలగాలని
ఫలించి ధరలో వ్యాపించాలని
ఘనుడేశు చేసిన ఘనమైన కార్యం
మానవాళికై చేసిన పరిశుద్ధ కావ్యం
ఐక్యపరచుమయ్య నీ దివ్య కృపతో
సౌఖ్యమిచ్చి కాయుము
నీవు ఉన్నత ప్రేమతో (2)
దేవా దీవించు నేడే ఈ వధూవరులను (2)
Athi Sreshtamaina Bandham | Telugu Christian Wedding Song
Lyrics: English
Madhuram madhuram kalyana raagam
Nee jatagaa nilichindi anuraaga geetam (2)
Aa Devuni chittame parishuddha parinayam
Melu nedu dorikindi ika aanandam (2)
1. Atimadhuram ee samayam
Jata kalise shubha tarunam
Nava dampatulaku nede suswaagatam
Okariki okarai kalisundaalani
Vishvaasa premalato jeevinchaalani
Aikyaparachumayya nee divya krupato
Soukhyamichchi kaayumu
Neevu unnata premato (2)
Devaa deevinchu nede ee vadhuvarulanu (2)
2. Ihaloka aashalu veedaalani
Chirunavvuto meeru saagaalani
Samsaara naava sarigaa nadapaalani
Samaadhaanamu meelo nilavaalani
Ati shreshtamaina bandham idi
Yehova kattina ille idi (2)
Aikyaparachumayya nee divya krupato
Soukhyamichchi kaayumu
Neevu unnata premato (2)
Devaa deevinchu nede ee vadhuvarulanu (2)
3. Vinayamuto meeru edagaalani
Kreestu Yesu saakshulugaa undaalani
Paraloka deevenalu kalagaalani
Phalinchi dharalo vyaapinchaalani
Ghanudesu chesina ghanamaina kaaryam
Maanavaalikai chesina parishuddha kaavyam
Aikyaparachumayya nee divya krupato
Soukhyamichchi kaayumu
Neevu unnata premato (2)
Devaa deevinchu nede ee vadhuvarulanu (2)