నీ కృపలేని క్షణము / Nee Krupaleni kshanamu / Telugu Christian Song Lyrics / Nycil KK / P JohnWesly


Lyrics: Telugu

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) // నీ కృప //

1. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2) // యేసయ్యా //

2. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2) // యేసయ్యా //

 


Nee Krupaleni kshanamu / Telugu Christian Song Lyrics / Nycil KK / P JohnWesly

Lyrics: English

Yesayya nee krupa naaku chaalayya
Nee krupa lenide ne brathukalenayya

Nee krupa leni kshanamu
nee daya leni kshanamu
Nenoo hinchalenayya Yesayya (2)
Yesayya nee krupa naaku chaalayya
Nee krupa lenide nenundalenayya (2)
            || Nee Krupa ||
1. Mahimanu vidichi mahiloki digivachchi
Maargamugaa maari manishigaa maarchaavu
Mahini neevu maadhuryamugaa maarchi
Madhiri choopi maro roopamichchaavu (2)
Mahimalo nenu mahimanu ponda
Mahimaga maarchindi nee krupa (2)
           || Yesayya ||
2. Aajnyala maargamuna aashrayamunu ichchi
Aapathkaalamuna aadukonnaavu
Aathmeeyulatho aanandimpa chesi
Aananda tailamutho abhishekkinchaavu (2)
Aasha theera aaraadhana chese
Adrushthamichchindi nee krupa (2)
           || Yesayya ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *