దేవర నీ దీవెనలు | Telugu Christian Marriage Song Lyrics

పాట రచయిత: అల్లారి పెద్ద వీరాస్వామి


Lyrics: Telugu

దేవర నీ దీవెనలు
ధారాళముగను వీరలపై
బాగుగ వేగమే దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను (2)

1. దంపతులు దండిగ నీ
ధాత్రిలో వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు
సహింపున వీరు సుఖించుటకై    //దేవర నీ//

2. ఈ కవను నీ కరుణన్
ఆకరు వరకును లోకములో
శోకము లేకయే ఏకముగా
బ్రాకటముగను జేకొనుము  //దేవర నీ//

3. ఇప్పగిది నెప్పుడును
గొప్పగు ప్రేమతో నొప్పుచు దా
మొప్పిన చొప్పున దప్పకను
మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్  //దేవర నీ//

4. తాపములు పాపములు
మోపుగ వీరిపై రాకుండగా
గాపుగ బ్రాపుగ దాపునుండి
యాపదలన్నియు బాపుచును  //దేవర నీ//

5. సాధులుగన్ జేయుటకై
శోధనలచే నీవు శోధింపగా
కదలక వదలక ముదమున నీ
పాదము దాపున బాదుకొనన్  //దేవర నీ//

6. మెండుగ భూమండలపు
గండములలో వీరుండగను
తండ్రిగ దండిగ నండనుండి
వెండియు వానిని ఖండించావే  //దేవర నీ//

7. యిద్దరు వీరిద్దరును
శుద్ధులై నిన్ను సేవించుటకై
శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్
దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్  //దేవర నీ//

8. వాసిగ నీ దాసులము
చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడ
యేసుని పేరిట బ్రోవుమామేన్  //దేవర నీ//

 


Devara Nee Deevenalu | Telugu Christian Marriage Song Lyrics

Lyricist: Allaari Pedda Veeraaswaami

Lyrics: English

Devara Nee Deevenalu
Dhaaraalamuganu Veeralapai
Baaguga Vegame Diganimmu
Paavana Yesuni Dvaaraganu (2)

1. Dampathulu Dandiga Nee
Dhaathrilo Velayuchu Sampadalan
Sompuga Nimpuga Pempaguchu
Sahimpuna Veeru Sukhinchutakai  //Devara Nee//

2. Ee Kavanu Nee Karunan
Aakaru Varakunu Lokamulo
Shokamu Lekaye Ekamugaa
Braakatamuganu Jekonumu  //Devara Nee//

3. Ippagidi Neppudunu
Goppagu Prematho Noppuchu Daa
Moppina Choppuna Dappakanu
Meppuga Brathukaga Bampu Krupan //Devara Nee//

4. Thaapamulu Paapamulu
Mopuga Veeripai Raakundagaa
Gaapuga Braapuga Daapunundi
Yaapadalanniyu Baapuchunu  //Devara Nee//

5. Saadhulugan Jeyutakai
Shodhanalache Neevu Shodhinpagaa
Kadalaka Vadalaka Mudamuna Nee
Paadamu Daapuna Baadukonan //Devara Nee//

6. Menduga Bhoomandalapu
Gandamulalo Veerundaganu
Thandriga Dandiga Nandanundi
Vendiyu Vaanini Khandinchave  //Devara Nee//

7. Iddara Veeriddarunu
Shudhdhulai Ninnu Sevinchutakai
Shradhdhatho Budhdhiga Sidhdhapadan
Didhdhumu Nee Priya Biddalugaan  //Devara Nee//

8. Vaasiga Nee Daasulamu
Chesina Ee Moral Deesikoni
Maa Sakaleshwara Nee Suthuda
Yesuni Perita Brovumaamen //Devara Nee//

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *