విత్తనం విరుగకపోతే ఫలించునా | Dr.Asher Andrew | John Pradeep | The Life Temple
Lyrics: Telugu
విత్తనం విరుగకపోతే – ఫలించునా
కష్టాలే లేకపోతే – కిరీటమే వచ్చునా (2)
శ్రమలే నా అతిశయం – శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం – విశ్వానమే నా బలం (2)
|| విత్తనం ||
1. పోరాటం దేవునిదైతే – నాకేల ఆరాటం
విశ్వసించి నిలుచుంటేనే – ఇస్తాడు విజయ కిరీటం (2)
గొల్యాతును పుట్టించినదే – దావీదును హెచ్చించుటకే (2)
కిరీటం కావాలంటే – గొల్యాతులు రావొద్దా? (2)
|| శ్రమలే ||
2. సేవించే మహా దేవుడు – రక్షించక మానునా
రక్షించక పోయిన సేవించుట మానము (2)
ఇటువంటి విశ్వాసమే – తండ్రినే తాకునే (2)
అగ్నిలోకి ప్రభువేరాగా – ఏదైన హాని చేయునా (2)
|| శ్రమలే ||
3. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు
శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2)
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే (2)
వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా (2)
|| శ్రమలే ||
Vithanam Virugakapothe | Dr.Asher Andrew | John Pradeep | The Life Temple
Lyrics: English
Vittanam virugakapote – phalinchunaa
Kashtaale lekapote – kireetame vachchunaa (2)
Shramale naa atishayam – shramalone aanandam
Shramalayande utsaaham – vishwaaname naa balam (2)
|| Vittanam ||
1. Charanam
Poraatam Devunidaithe – naakela aaraatam
Vishwasinchi niluchuntene – istaadu vijaya kireetam (2)
Golyaatunu puttinchinade – Daaveedunu hechchinchutake (2)
Kireetam kaavaalante – Golyaatulu raavoddaa? (2)
|| Shramale ||
2. Charanam
Sevinche Mahaa Devudu – rakshinchaka maanunaa
Rakshinchaka poyina sevinchuta maanamu (2)
Ituvanti vishwaasame – Tandrine taakune (2)
Agniloki Prabhu veragaa – edaina haani cheyunaa (2)
|| Shramale ||
3 Charanam
Ishraayelu prajalanu Aigupta adhikaarulu
Shrama pette koladi vaaru vistarinchi prabaliri (2)
Pharonu puttinchinade Prabhu shaktini chaatutake (2)
Vaagdaanam neraveraa Pharolu raavoddaa? (2)
|| Shramale ||