ప్రార్ధన వినెడి పావనుడా | Prardhana Vinedi Pavanuda | Telugu Christian Song Lyric
Lyrics: Telugu
ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన||
1. శ్రేష్టమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి (2)
పరముడ నిన్ను ప్రనుతించెదము
పరలోక ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
2. పరమ దేవుడవని తెలిసి
కరము లెత్తి జంటగా మోడ్చి (2)
శిరమునువంచి సరిగను వేడిన
సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
3. దినదినంబు చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ (2)
దీనుడవయ్యి దిటముగా కొండను
చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
4. శత్రుమూక నిను చుట్టుకొని
సిలువపైన నిను జంపగను (2)
శాంతముతో నీ శత్రుల బ్రోవగ
సలిపిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
Prardhana Vinedi Pavanuda | Telugu Christian Song Lyric
Lyrics: English
Praarthana Vinedi Paavanudaa
Praartana Maaku Nerpumayaa ||Praarthana||
1. Sreshtamaina Bhaavamu Goorchi
Shishya Brundamuku Nerpithivi (2)
Paramuda Ninnu Pranuthinchedamu
Paraloka Praarthana Nerpumayaa ||Praarthana||
2. Parama Devudavani Thelisi
Karamu Leththi Jantaga Modchi (2)
Shiramunuvanchi Sariganu vedina
Sunkari Praarthana Nerpumayaa ||Praarthana||
3. Dinadinambu Chesina Seva
Daiva Chiththamuku Saripova (2)
Deenudavayyi Ditamuga Kondanu
Chesina Praarthana Nerpumayaa ||Praarthana||
4. Shathrumooka Ninu Chuttukoni
Siluvapaina Ninu Jampaganu (2)
Shaanthamutho Nee Shathrula Brovaga
Salipina Praarthana Nerpumayaa ||Praarthana||