పరమునుండ వలసినోడు | Bethu Vivek & Prasanth | Telugu Christmas Song 2026


Lyrics: Telugu

పరమునుండ వలసినోడు
పుడమి నుండ వచ్చినాడు
ఒక్కసారి చూసి వద్దామా
ఓ అమ్మలారా వందనాలు చేసి వద్దమా
రాజఠీవికలిగినోడు రాజవంశమున్నవాడు
బీదలింట పుట్టినాడురా
ఓ యన్నలారా బాగు చేయ వచ్చినాడురా
ఓహోహో… ఓహో … ఓ ఓ ఓ ఓ ఓ

1. పరమునుండి దేవదూత వచ్చింది
పొలములోని గొల్లలకు చెప్పింది (2)
రక్షకుడుపుట్టినాడని లోకరక్షణార్ధ వచ్చినాడని
బెత్లహేముపురమునందుని
పశువుల పాకనందు చూడ బొమ్మని
దేవదూత చెప్పినాక, ఆనవాలు ఇచ్చినాక
చూడకుండ ఊరుకుందుమా ఓయన్నాలారా
ఊరువాడ చాటకుందుమా
చేతులెత్తి వేడుకుందుమా
చిన్నారి బాల యేసు వద్ద కూడుకుందుమా
ఓహోహో… ఓహో … ఓ ఓ ఓ ఓ ఓ

2. ఆకాశన తార ఒకటి వెలసింది
తూర్పు దేశ జ్ఞానులకు తెలిపింది (2)
ప్రజాపతి పుట్టినాడని ఆ పురము నుండి వచ్చినాడని
ఋగ్వేదంలోన ఉందని
ఆ తార మనకు ఆనవాలని
వేద ఋషులుచెప్పినాక
తూర్పుజ్ఞానులొచ్చినాక
చూడకుండ ఊరకుందుమా ఓయమ్మలారా
పాడకుండ మూగబోదుమా
కానుకిచ్చి కలిసివద్దమా
జనమంత కూడి జానపదలు పాడుకుందుమా
ఓహోహో… ఓహో … ఓ ఓ ఓ ఓ ఓ

3. లోకమంత వెలుగులో నిండింది
యేసు రాకతో పంట పండింది (2)
మూగవారు పాటపాడగ
పుట్టిచెవిటివారు ఆలకించెగా
కుంటివారు గంతులెయ్యగా
పుట్టి గ్రుడి వారు చూడ పండుగ
యేసురాజు పుట్టినాక అద్భుతాలు జరిగినాక
నమ్మకుండ ఊరకుందుమా
యేసయ్య చెంత చేరకుండ మానకుందుమా
మనము కూడా బాగుపడుదుమా
ఓయన్నాలారా యేసు మాటలాలకింతుమా
ఓహోహో… ఓహో … ఓ ఓ ఓ ఓ ఓ


PARAMUNUNDA VALASINODU | Bethu Vivek & Prasanth | Telugu Christmas Song 2026

Lyrics: English

Paramununda valasinodu
Pudami nundi vachchinaadu
Okkasaari choosi vaddaamaa
O ammalaraa vandanaalu chesi vaddaamaa
Raajatheevikaliginodu raajavamshamunnavaadu
Beedhalinta puttinaaduraa
O yannalaaraa baagu cheya vachchinaaduraa
Ohoho… Ohoho… O O O O O

1. Paramunundi devadootha vachchindi
Polamuloni gollalaku cheppindi (2)
Rakshakudu puttinaadani loka rakshanaardham vachchinaadani
Bethlehemu puramunanduni
Pashuvula paakanandu chooda bommani
Devadootha cheppinaaka, aanavaalu ichchinaaka
Choodakunda oorukundumaa O yannaalaaraa
Ooruvaada chaatakundumaa
Chethulethi vedukundumaa
Chinnaari baala Yesu vadda koodukundumaa
Ohoho… Ohoho… O O O O O

2. Aakaashana thaara okati velasindi
Thoorpu desha gnaanulaku thelipindi (2)
Prajaapathi puttinaadani aa puramu nundi vachchinaadani
Rugvedamlo undani
Aa thaara manaku aanavaalani
Veda rushulu cheppinaaka
Thoorpu gnaanulocchinaaka
Choodakunda oorakundumaa O yammalaaraa
Paadakunda moogabodumaa
Kaanukichchi kalisivaddamaa
Janamantha koodi jaanapadalu paadukundumaa
Ohoho… Ohoho… O O O O O

3. Lokamantha velugulo nindindi
Yesu raakatho panta pandindi (2)
Moogavaaru paata paadaga
Puttichevitivaaru aalakinchegaa
Kuntivaaru ganthuleyyagaa
Puttigruddivaaru chooda panduga
Yesuraaju puttinaaka adbhuthaalu jariginaaka
Nammakunda oorakundumaa
Yesayyaa chentha cherakunda maanakundumaa
Manamu kooda baagupadudumaa
O yannaalaaraa Yesu maatal aalakिंthumaa
Ohoho… Ohoho… O O O O O

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *