నిరంతరం నీతోనే జీవించాలనే | Telugu Christian Song Lyrics


Lyrics: Telugu

నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)
నా ప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా  // నిరంతరం //

1. చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను (2)
నీలోనే నేను వెలగాలని
నీ మహిమ నాలో నిలవాలని (2)
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై  // నిరంతరం //

2. నీ రూపము నేను కోల్పయినా
నీ రక్తముతో కడిగితివి (2)
నీతోనే నేను నడవాలని
నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై  // నిరంతరం //

3. తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోని నాటితివి (2)
నీలోనే చిగురించాలని
నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై  // నిరంతరం //

 


Nirantharam neethone jeevinchaalane | Telugu Christian Song Lyrics

Lyrics: English

Nirantharam neethone jeevinchaalane
Aasha nannila brathikinchuchunnadi (2)
Naa praaneeshwaraa Yesayyaa
Naa sarvaswamaa Yesayyaa
// Nirantharam //

1. Cheekatilo ne nunnappudu
Nee velugu naapai udayinchenu (2)
Neelone nenu velagaalani
Nee mahima naalo nilavaalani (2)
Parishuddhaathma abhishekamutho
Nannu nimpochunnaavu nee raakada kai
// Nirantharam //

2. Nee roopamu nenu kolpoyinaa
Nee rakthamutho kadigithivi (2)
Neethone nenu nadavaalani
Nee valene nenu maaraalani (2)
Parishuddhaathma varamulatho
Alankarinchuchunnaavu nee raakada kai
// Nirantharam //

3. Tholakari varshapu jallulalo
Nee polamuloni naatithivi (2)
Neelone chigurinchaalani
Neelone pushpinchaalani (2)
Parishuddhaathma varshamutho
Siddhaparachuchunnaavu nee raakada kai
// Nirantharam //

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *