నమ్మితిని నిను మాత్రమే | Pastor Syam Noel | Latest Christian song
Lyrics: Telugu
నమ్మితిని నిను మాత్రమే
నెమ్మదినిచ్చే దేవుడని
కన్నులు దాటిన కన్నీటిని
మహదానందముగా మార్చే సమర్థుడని
నను పిలిచిన దేవుడ నీవే
నీకై మలచిన మహిమాన్వితుడవే (2) || నమ్మితిని ||
1. కనుగొన్నావు మరుగైన వేళలో
భయపడకన్నావు బలమైన వాక్కుతో (2)
సాయమేమి లేని వేళ
సాగుచేశావు నా త్రోవలు
భారమైన బ్రతుకుపైన
జాలి చూపి నన్నాదరించావు (2)
|| నను పిలిచిన ||
2. సరిచేయుటకే కొలిమిలో కాల్చావు
ఘనపరచుటకే గాయం చేశావు (2)
విన్నపాలకు విసుగుచెందక
కన్నతండ్రి గా తోడున్నావు
కంటి పాపలా నన్ను కాయుచు
వెంట వుండి నడిపించావు (2)
|| నను పిలిచిన ||
Nammithini Ninu Maathrame | Pastor Syam Noel | Latest Christian song
Lyrics: English
Nammithini ninu maathrame
Nemmadinichche Devudani
Kannulu daatina kanneetini
Mahadaanandamugaa maarche samarthudani
Nanu pilichina Devuda neeve
Neekai malachina mahimaanvitudave (2)
|| Nammithini ||
1. Kanugonnaavu marugaina velalo
Bhayapadakannaavu balamaina vaakkutho (2)
Saayamemi leni vela
Saagucheshaavu naa trov̄alu
Bhaaramaina bratukupaina
Jaali choopi naannadarinchaavu (2)
|| Nanu pilichina ||
2. Saricheyutake kolimilo kaalchaavu
Ghanaparachutake gaayam cheshaavu (2)
Vinnapaalaku visuguchendaka
Kannatandrigaa thodunnaavu
Kanti paapalaa nannu kaayuchu
Venta vundi nadipinchaavu (2)
|| Nanu pilichina ||