మహాదానందమైన నీదు సన్నిధి | Hosanna Ministries 32rd Volume 2022 Song Lyrical


మహాదానందమైన నీదు సన్నిధి
ఆపత్కాలమందు దాగు చోటది
మానవులు అన్నియు ఆలకించినా
వినయము గల వారికి ఘనతయిచ్చినా
నీ సింహాసనమును స్థాపించుటకు –
నీవు కోరుకున్న సన్నిధానము   (2)
ఎంత మధురము నీ ప్రేమ మందిరం
పరవసమే నాకు యేసయ్య   (2)   || మహా ||

1. విసిగిన హృదయం కలవరమొంది
వినయము కలిగి నిన్ను చేరగా (2)
పరమందుండి నీవు కరుణ చూపగ
లేత చిగురు పైన మంచు కురుయురీతిగా  (2)
ప్రేమను చూపి బహువు చాపి
నీలో నన్ను లీనము చేసిన   (2)
ప్రేమ సాగర జీవితాంతము
నీ సన్నిధిని కాచుకొందును  (2)   || మహా ||

2. లెక్కించ లేని స్థుతులతో నీవు
శాశ్వత కాలము స్తుతి నొందెదవు  (2)
మహిమతో నీవు సంచరించగా
ఏడు దీప స్తంభమూలకు వెలుగు కలుగగా (2)
ఉన్నతమైన ప్రత్యక్షతను
నే చూచుటకు కృపనిచ్చితివి  (2)
కృపా సాగర వధువు సంఘమై
నీ కోసమే వేచియుందును (2)   || మహా ||

3. సియ్యెను శిఖరమే నీ సింహాసనం
శుద్ధులు నివసించు మహిమ నగరము  (2)
ఎవరు పాడలేని క్రొత్త కీర్తన
మధురముగా నీ యెదుట నేను పాడేదా  (2)
సౌందర్యముగా అలంకరించిన
నగరములోనే నివసించెదను   (2)
ప్రేమ పూర్ణుడా మహిమాన్వితుడా
నీతోనే రాజ్యమేలేదా  (2)   || మహా ||

 


 

Maha Daanandamaina Needu Sannidhi
Aapath Kaalamandu Daagu Chotadi
Maanavulu Anniyu Aalakinchina
Vinayamu Gala Vaariki Ghanathayichchina
Nee Simhasanamunu Sthaapinchutaku
Neevu Korukunna Sannidhaanamu (2)
Entha Madhuramu Nee Prema Mandiram
Paravasame Naaku Yesayya (2)
|| Maha ||

1. Visigina Hridayam Kalavaramondi
Vinayamu Kaligi Ninnu Cheraga (2)
Paramandundi Neevu Karuna Choopaga
Letha Chiguru Paina Manchu Kuruyurithiga (2)
Premanu Choopi Bahuvu Chaapi
Neelo Nannu Leenamu Chesina (2)
Prema Saagara Jeevithaantamu
Nee Sannidhini Kaachukondunu (2)
|| Maha ||

2. Lekkhincha Leni Stuthulatho Neevu
Shaashvatha Kaalamu Stuthi Nondevalu (2)
Mahimatho Neevu Sancharinchaga
Edu Deepa Sthambhamoolaku Velugu Kalugaga (2)
Unnathamaina Pratyakshathanu
Ne Choochutaku Krupanichitivi (2)
Kripaa Saagara Vadhuvu Sanghamai
Nee Kosame Vechiyundunu (2)
|| Maha ||

3. Siyyenu Shikharame Nee Simhasanam
Shuddhulu Nivasinchu Mahima Nagaramu (2)
Evaru Paadalaeni Kotha Keerthana
Madhuramuga Nee Yedhutu Nenu Paadedaa (2)
Soundaryamuga Alankarinchina
Nagaramulone Nivasinchedanu (2)
Prema Poornudaa Mahimanvitudaa
Neetone Raajyameleda (2)
|| Maha ||

 

 

Maha Daanandamaina Needu Sannidhi Song Audio

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *