కలత చెందకు కన్నీళ్లు విడువకు | Jessi D | Suma S | Sudhakar Rella | CH. Gershom | CAAM


Lyrics: Telugu

కలత చెందకు కన్నీళ్లు విడువకు
యేసయ్య నీ కొరకు చింతిస్తున్నాడు (2)
వేదన మాని.. రోదన విడిచి..  (2)
యేసయ్య పై నీవు నమ్మకముంచుము  (2)

ఓ మిత్రమా… నీవు నమ్మితే చాలు 
ఆ యేసయ్యే నీకు తోడుగా నిలుచును  (2)  // కలత //

1. అలిసిన వేళలో – నిన్ను సేదదీర్చును
ప్రతికూల సమయములో – నీకు తోడుండును (2)
శాంతికరమైన – జలముల యొద్దను
యేసయ్య నిన్ను – నడిపించును  (2)
యేసయ్య నిన్ను – నడిపించును  // ఓ మిత్రమా.. //

2. నీ ప్రతి భారము – ఆయనే మోయును
తన విశ్రాంతిని – నీకు ఇచ్చును  (2)
నాశనకరమైన – తెగులు రాకుండ
యేసయ్య నిన్ను – రక్షించును (2)
యేసయ్య నిన్ను – రక్షించును  // ఓ మిత్రమా.. //

3. ఇహలోక శ్రమలెన్నో – కలుగచుండినను
నీ వారే నిన్ను – గేలిచేసినను  (2)
ఈ లోక పాపమును – శిలువలో మోసిన
యేసయ్య నిన్ను – ప్రేమించును (2)
యేసయ్య నిన్ను – ప్రేమించును // ఓ మిత్రమా.. //


KALATHACHENDAKU | Jessi D | Suma S | Sudhakar Rella | CH. Gershom | CAAM

Lyrics: English

Kalata chendaku kanneellu viduvaku
Yesayya nee koraku chintistunnadu (2)
Vedana maani.. rodana vidichi.. (2)
Yesayya pai neevu nammakamunchumu (2)

O mitramaa… neevu nammithe chaalu
Aa Yesayye neeku toodugaa niluchunu (2)
|| Kalata ||

1. Alisina velalo – ninnu sedadeerchunu
Pratikoola samayamulo – neeku toodundunu (2)
Shaantikaramaina – jalamula yoddanu
Yesayya ninnu – nadipinchunu (2)
Yesayya ninnu – nadipinchunu
|| O mitramaa ||

2. Nee prati bhaaramu – aayane moyunu
Tana vishraantini – neeku ichchunu (2)
Naashanakaramaina – tegulu raakunda
Yesayya ninnu – rakshinchunu (2)
Yesayya ninnu – rakshinchunu
|| O mitramaa ||

3. Ihaloka shramalenno – kalugachundinanu
Nee vaare ninnu – gelichesinanu (2)
Ee loka paapamunu – siluvalo mosina
Yesayya ninnu – preminchunu (2)
Yesayya ninnu – preminchunu
|| O mitramaa ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *