కలత చెందకు కన్నీళ్లు విడువకు | Jessi D | Suma S | Sudhakar Rella | CH. Gershom | CAAM
Lyrics: Telugu
కలత చెందకు కన్నీళ్లు విడువకు
యేసయ్య నీ కొరకు చింతిస్తున్నాడు (2)
వేదన మాని.. రోదన విడిచి.. (2)
యేసయ్య పై నీవు నమ్మకముంచుము (2)
ఓ మిత్రమా… నీవు నమ్మితే చాలు
ఆ యేసయ్యే నీకు తోడుగా నిలుచును (2) // కలత //
1. అలిసిన వేళలో – నిన్ను సేదదీర్చును
ప్రతికూల సమయములో – నీకు తోడుండును (2)
శాంతికరమైన – జలముల యొద్దను
యేసయ్య నిన్ను – నడిపించును (2)
యేసయ్య నిన్ను – నడిపించును // ఓ మిత్రమా.. //
2. నీ ప్రతి భారము – ఆయనే మోయును
తన విశ్రాంతిని – నీకు ఇచ్చును (2)
నాశనకరమైన – తెగులు రాకుండ
యేసయ్య నిన్ను – రక్షించును (2)
యేసయ్య నిన్ను – రక్షించును // ఓ మిత్రమా.. //
3. ఇహలోక శ్రమలెన్నో – కలుగచుండినను
నీ వారే నిన్ను – గేలిచేసినను (2)
ఈ లోక పాపమును – శిలువలో మోసిన
యేసయ్య నిన్ను – ప్రేమించును (2)
యేసయ్య నిన్ను – ప్రేమించును // ఓ మిత్రమా.. //
KALATHACHENDAKU | Jessi D | Suma S | Sudhakar Rella | CH. Gershom | CAAM
Lyrics: English
Kalata chendaku kanneellu viduvaku
Yesayya nee koraku chintistunnadu (2)
Vedana maani.. rodana vidichi.. (2)
Yesayya pai neevu nammakamunchumu (2)
O mitramaa… neevu nammithe chaalu
Aa Yesayye neeku toodugaa niluchunu (2)
|| Kalata ||
1. Alisina velalo – ninnu sedadeerchunu
Pratikoola samayamulo – neeku toodundunu (2)
Shaantikaramaina – jalamula yoddanu
Yesayya ninnu – nadipinchunu (2)
Yesayya ninnu – nadipinchunu
|| O mitramaa ||
2. Nee prati bhaaramu – aayane moyunu
Tana vishraantini – neeku ichchunu (2)
Naashanakaramaina – tegulu raakunda
Yesayya ninnu – rakshinchunu (2)
Yesayya ninnu – rakshinchunu
|| O mitramaa ||
3. Ihaloka shramalenno – kalugachundinanu
Nee vaare ninnu – gelichesinanu (2)
Ee loka paapamunu – siluvalo mosina
Yesayya ninnu – preminchunu (2)
Yesayya ninnu – preminchunu
|| O mitramaa ||