సఖుడా దివ్య సఖుడా | DivyaSakhudaa | Hosanna Ministries 2026
Lyrics: Telugu
సఖుడా – దివ్య సఖుడా
ప్రియుడా – ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము కాదే ఈ నాటిది
ఏనాటికీ వీడిపోదు – విభుడా యేసయ్యా
ఇన్నినాళ్ల తీపి జ్ఞాపిక – పలికే గీతిక
|| సఖుడా ||
1. మౌనరాగమే – మధురగానమై
మరుపురానిదై – మదిలో నిలిచెగా (2)
ఊహించని శోధనలే – శృతిలయలు నేర్పినాయి
పలుశ్రమలు నడిపినాయి నీ ప్రేమ శిఖరానికి
ఏకాంత వేళలో – ఏ కాంతి లేకున్ననూ
నా పాదములు జ్ఞారక – కాపాడే యేసయ్యా
సద్గుణ రాశివి నీవేనని
స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను || సఖుడా ||
2. నిండు మనస్సులో – ప్రేమ దీపమై
మారుమనస్సుకై – సత్యమార్గమై (2)
పలికే ప్రేమనీవై – నీవు నాతో నున్నావు
నా హృదయసీమ నేలే – మహరాజుగా నిలిచావు
నీవు నా ముందుగా – నడిచే కాపరిగా
నా చేయి వీడకా – నడిపించే యేసయ్యా
సద్గుణ రాశివి నీవేనని
స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను || సఖుడా ||
3. రమ్యమైనది – భాగ్యమైనది
నిత్యమైనది – సరిపోల్చలేనిది (2)
నీ మహిమ రాజ్యమందు – సీయోను శిఖరమందు
నే పరవశించి పాడే – గొప్ప భాగ్యమిచ్చినావు
నూతనమైనది – ఎవరూ పాడలేని
శ్రేష్ఠమైన గీతం – నే పాడెద యేసయ్యా
సద్గుణ రాశివి నీవేనని
స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను || సఖుడా ||
DivyaSakhudaa | Hosanna Ministries 2026
Lyrics: English
Sakhudaa – divya sakhudaa
Priyudaa – praana priyudaa
Neetho anubandhamu kaade ee naatidi
Enaatiki veedipodu – vibhudaa Yesayya
Inninaalla teepi jnaapika – palike geethika
|| Sakhudaa ||
1. Maunaraagame – madhura gaanamai
Marupuraanidai – madilo nilichegaa (2)
Oohinchani shodhanale – shrutilayalu nerpinayi
Palushramalu nadipinayi nee prema shikharaniki
Ekaanta velalo – e kaanti lekunna
Naa paadamulu jnaaraka – kaapaade Yesayya
Sadguna raashivi neevenani
Stuti mahimalu chellinchedanu
Nityamu ninu keerthinchedanu
|| Sakhudaa ||
2. Nindu manassulo – prema deepamai
Maaru manassukai – satya maargamai (2)
Palike prema neevai – neevu naatho nunnaavu
Naa hrudaya seema nele – Maharaajugaa nilichaavu
Neevu naa mundugaa – nadiche kaaparigaa
Naa cheyi veedakaa – nadipinche Yesayya
Sadguna raashivi neevenani
Stuti mahimalu chellinchedanu
Nityamu ninu keerthinchedanu
|| Sakhudaa ||
3. Ramyamainadi – bhaagyamainadi
Nityamainadi – saripolchalenidi (2)
Nee mahima raajyamandu – Seeyonu shikharamandu
Ne paravashinchi paade – goppa bhaagyamichchinaavu
Nootanamainanidi – evaroo paadaleni
Shreshtamaina geetam – ne paadedha Yesayya
Sadguna raashivi neevenani
Stuti mahimalu chellinchedanu
Nityamu ninu keerthinchedanu
|| Sakhudaa ||