విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా | Hosanna Ministries 2017 Album  Song Lyrical

విజయశీలుడా Album – 2017


Lyrics: Telugu

విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2)
నా యేసయ్యా నిను వేడుకొనగా
నా కార్యములన్నియు సఫలము చేసితివి (2)
||విజయశీలుడా||

1. అలసిన సమయమున నా ప్రాణములో
త్రాణ పుట్టించినావు  (2)
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి
ధైర్యముతో నింపినావు (2)
నిత్యానందము కలిగించె నీ శుభ వచనములతో
నెమ్మదినిచ్చితివి (2)
||విజయశీలుడా||

2. ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి
విడుదల కలిగించినావు – (2)
అరణ్య మార్గమున విడువక తోడై
విజయముతో నడిపినావు (2)
నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి
వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా (2)
||విజయశీలుడా||

3. ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో
ఆశ్రయమిచ్చితివి నాకు – (2)
అక్షయుడా నా సంపూర్ణతకై
మహిమాత్మతో నింపినావు (2)
నిత్యము నీతో నేనుండుటకై
నూతన యెరూషలేము
నిర్మించుచున్నావు (2)
||విజయశీలుడా||

 


Vijayaseeluda Naa Praana Priyuda | Hosanna Ministries 2017 Album  Song Lyrical

Vijayaseeluda Album – 2017

Lyrics: English

Vijayaseeluda Naa Praana Priyuda
Krutajnatatho Ninu Stutunchedanu (2)
Naa Yesayya Ninu Vedukonaga
Naa Kaaryamulanniyu Safalamu Chesitivi (2)
|| Vijayaseeluda ||

1. Alasina Samayamuna Naa Praanamulonu
Trana Puttinchinavu (2)
Aadarana Kaliginchi Pilupunu Sthiraparachi
Dhairyamutho Nimpinavu (2)
Nityaanandamu Kaliginche Nee Shubha Vachanamulatho
Nemmadinichitivi (2)
|| Vijayaseeluda ||

2. Aascharyakaramuga – Nee Baahuvu Chaapi
Vidudala Kaliginchinavu (2)
Aranya Maargamuna Viduvaka Thodai
Vijayamutho Nadipinavu (2)
Nee Swaasthyamunaku Tandriga Nilichi
Vaagdhaana Bhoomilo – Cherchina Deva (2)
|| Vijayaseeluda ||

3. Aarogyakaramaina Nee – Rekkala Needalo
Aashrayamichitivi Naku (2)
Akshayuda Naa Sampoornathakai
Mahimaatmatho Nimpinavu (2)
Nityamu Neetho Nenundutakai
Noothana Yerushalemu
Nirminchuchunnavu (2)
|| Vijayaseeluda ||

 

 

Vijayaseeluda Song Audio

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *