రేయిపగలు నీ పద సేవే | Old Telugu Christian Song
Lyrics: Telugu
రేయిపగలు నీ పద సేవే
జీవదాయక చేయుట మేలు
సాటిలేని దేవుడ వీవే
నాదు కోట కొండయు నీవే (2)
1. పరమ పురిలో వరదా నిరతం
దూత గణముల స్తుతులను సల్ప (2)
శుద్ధుడు పరిశుద్ధుడనుచు
పూజనొందె దేవుడ వీవే (2) || రేయి ||
2. జిగటమన్నే మానవులంతా
పరమ కుమ్మరి ప్రభుడవు నీవే (2)
సృష్టి కర్తను మరచి జనులు
సృష్టినే పూజించుట తగునా (2) || రేయి ||
3. పెంట కుప్పల నుండి దీనుల
పైకి లేపు ప్రభుడవు నీవే (2)
గర్వ మణచి గద్దెలు దించి
ఘనులనైన మేపవా గడ్డి ! (2) || రేయి ||
4. నరుల నమ్ముట కంటె నిజముగ
నీదు చరణం శరణం దేవా (2)
రాజులను ధర నమ్ముట కంటే
రాజరాజవు నాకాశ్రయము (2) || రేయి ||
5. అగ్ని వాసనంటకుండ
అబెద్నెగోలతో నుండిన దేవా (2)
దానియేలును సింహపు బోనులో
ఆదుకొన్న నాథాుడ వీవే (2) || రేయి ||
6. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు
పరము జేర్చు పథము నీవే (2)
అడుగు జాడల నడచి హనోకు
పరము చేరె ప్రాణము తోడ (2) || రేయి ||
7. మృతుల సహితము లేపినావు
మృతిని గెల్చి లేచినావు (2)
మృతుల నెల్ల లేపే వాడవు
మృత్యువును మృతిచేసితి వీవు (2) || రేయి ||
Reyi Pagalu Nee Pada Seve | Old Telugu Christian Song
Lyrics: English
Reyi pagalu nee pada seve
Jeevadaayaka cheyuta melu
Saatileni Devuda veeve
Naadu kota kondayu neeve (2)
1. Parama purilo varadaa niratam
Doota ganamula stutulanu salpa (2)
Shuddhudu parishuddhudanuchu
Poojanonde Devuda veeve (2)
|| Reyi ||
2. Jigatamanne maanavulantaa
Parama kummari Prabhudavu neeve (2)
Srushtikartanu marachi janulu
Srushtine poojinchuta tagunaa (2)
|| Reyi ||
3. Penta kuppala nundi deenula
Paiki lepu Prabhudavu neeve (2)
Garva manachi gaddelu dinchi
Ghanulanaina mepavaa gaddi! (2)
|| Reyi ||
4. Narula nammutu kante nijamuga
Needu charanam sharanam Devaa (2)
Raajulanu dhara nammutu kante
Raajaraajavu naakaashrayamu (2)
|| Reyi ||
5. Agni vaasanantakunda
Abednegolato nundina Devaa (2)
Daaniyelunu simhapu bonulo
Aadukonna Naathudaa veeve (2)
|| Reyi ||
6. Parama Gurudavu Prabhulaku Prabhudavu
Paramu jerchu pathamu neeve (2)
Adugu jaadala nadachi Hanoku
Paramu chere praanamu toda (2)
|| Reyi ||
7. Mrutula sahitamu lepinavu
Mrutini gelchi lechinavu (2)
Mrutula nella lepe vaadavu
Mrutyuvunu mruti chesiti veevu (2)
|| Reyi ||