పరదేశులమో ప్రియులారా మన | Telugu Christian Song Lyrics


Lyrics: Telugu

పరదేశులమో ప్రియులారా మన
పురమిది గాదెపుడు (నిజముగ) (2) ||పరదేశుల||

1. చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి
చిత్రమైన సంత (లోకము) (2) ||పరదేశుల||

2. సంత గొల్లు క్షమ సడలిన చందం
బంతయు సద్దణగన్ (నిజముగ) (2) ||పరదేశుల||

3. స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని
బరలోకమే స్థిరము (నిజముగ) (2) ||పరదేశుల||

4. మేడలు మిద్దెలు మేలగు సరకులు
పాడై కనబడవే (నిజముగ) (2) ||పరదేశుల||

5. ధర ధాన్యంబులు దరగక మానవు
పని పాటలు పోయె (నిజముగ) (2) ||పరదేశుల||

6. ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన
మన్నై పోవునుగా (దేహము) (2) ||పరదేశుల||

7. వచ్చితి మిచటికి వట్టి హస్తముల
దెచ్చిన దేదియు లే (దు గదా) (2) ||పరదేశుల||

8. ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు
అట్లు వెళ్ళవలయున్ (మింటికి) (2) ||పరదేశుల||

9. యేసు నందు విశ్వాసం బుంచిన
వాసిగ నిను జేర్చున్ (బరమున) (2) ||పరదేశుల||

10. యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవముగా (నిజముగ) (2) ||పరదేశుల||

 


Paradeshulamo Priyulaara Mana Song | Telugu Christian Song Lyrics

Lyrics: English

Paradesulamo priyulaara mana
Puramidi gaadeppudu (nijamuga) (2)
// Paradesula //

1. Chitra vastuvulu chelleDi yokavi
Chitramaina santa (lokamu) (2)
// Paradesula //

2. Santa gollu kshama sadalina chandam
Bantayu saddanagan (nijamuga) (2)
// Paradesula //

3. Sthiramani nammaku dhara evvarikini
Paralokame sthiramu (nijamuga) (2)
// Paradesula //

4. Medalu middelu melagu sarakulu
Paadai kanabadave (nijamuga) (2)
// Paradesula //

5. Dhara dhaanyambulu daragaka maanavu
Pani paatalu poye (nijamuga) (2)
// Paradesula //

6. Enni naallu mana milalo bratikin
Mannai povunugaa (dehamu) (2)
// Paradesula //

7. Vachchiti michatiki vatti hastamula
Dechchina dediyu le (du gada) (2)
// Paradesula //

8. Etlu vachchitimi ee lokamunaku
Atlu vellavalayun (mintiki) (2)
// Paradesula //

9. Yesu nandu vishwasam bunchina
Vaasiga ninu cherchun (paramuna) (2)
// Paradesula //

10. Yese maargamu Yese satyamu
Yese jeevamuga (nijamuga) (2)
// Paradesula //


 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *