నీవే శ్రావ్యసదనము – నీదే శాంతివదనము | Hosanna ministries 2024 song Lyrics
నిత్యతేజుడా Album – 2024
నీవే శ్రావ్యసదనము
నీదే శాంతివదనము
నీ దివి సంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్యా ||నీవే ||
1. విరజిమ్మే నాపై కృప కిరణం
విరబుసే పరిమళమై కృప కమలం (2)
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయశిఖరము చేరుటకు
నీ దక్షిణహస్తం చాపితివి
నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి నడిపించే నా యేసయ్యా ||నీవే ||
2. నీ నీతి నీరాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు (2)
నలిగి విరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా ||నీవే ||
3. పరిశూద్దాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా (2)
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయా
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా ||నీవే ||
Neeve Shraavyasadanamu – Needey Shaantivadanamu | Hosanna ministries 2024 song Lyrics in English
Nityatejudaa Album – 2024
Neeve Shraavyasadanamu
Needey Shaantivadanamu
Nee Divi Sampada Nanne Cheragaa
Naa Prathi Prardhana Neeve Teerchagaa
Naa Prathi Spondane Ee Aaradhana
Naa Hrudayarpana Neeke Yesayya ||Neeve||
1. Virajimme Naapai Krupa Kiranam
Virabuse Parimalamai Krupa Kamalam (2)
Vishvaasayathralo Ontarinai
Vijayashikaramu Cherutaku
Nee Dakshinahastam Chaapitivi
Nannadukonutaaku Vachitivi
Nanu Balaparachi Nadipinche Naa Yesayya ||Neeve||
2. Nee Neeti Neerajyam Vedakitini
Nindaina Saubhaagyam Pondutaku (2)
Nalagi Virigina Hrudayamuto
Nee Vaakyamunu Sanmaninchitini
Shreyaskaramaina Deevenato
Shreshtha Phalamulanu Icchutaku
Nanu Preminchi Pilachitivi Naa Yesayya ||Neeve||
3. Parishuddhaatmakanu Nilayamuga
Upadeshamunu Vinayamuga (2)
Mahima Simhaasanamu Cherutaku
Vadhuvu Sanghamuga Marchumaya
Naa Pitarulaku Aashrayamai
Korina Revuku Cherpinchi
Nee Vaagdanam Neravechitivi Naa Yesayya ||Neeve||