నాలో ఏమి చూచి నీవు | Hosanna Ministries New Song 2023 | Ps.Ramesh garu
Lyrics: Telugu
నాలో ఏమి చూచి నీవు
ఇంత ప్రేమ చూపినావు (2)
మర్త్యమైన లోకమందు
నిత్యమైన కృపను చూపి
నేటి వరకు తోడుండినావు
యేసయ్య యేసయ్య నా యేసయ్య (2)
1. నా తల్లి గర్భమునే నను కోరితివి
విశ్వాస గృహములో నన్నుచేర్చితివి (2)
అమృత జలమైన నీ నోటి మాటలతో
నిఖిల జగతికి నన్ను పంపినావు
ప్రకటింప నీ చరితం –
నాజన్మ నిజ ఫలితం (2) || నాలో ఏమి ||
2. ఘనులైన వారే నీ యెదుట నున్నను
బలమైన వారే ఎందరో ఉన్నను (2)
కన్నీళ్ల కడలిలో శ్రమల సుడులలో
నా స్థితి చూచి నన్ను చేరదీసి
మార్చితివి నీ పత్రికగా –
కడవరకు నీ సాక్షిగా (2) || నాలో ఏమి ||
3. ప్రేమానురాగం నీ సంస్కృతియే
కరుణాకటాక్షము నీ గుణసంపదయే (2)
నలిగినా రెల్లును విరువనివాడ
చితికిన బ్రతుకును విడువనివాడ
నా పైన నీకెందుకో –
ఈ తగని వాత్సల్యము (2) || నాలో ఏమి ||
4. ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు
వర్ణనకందని అతిసుందరుడవు (2)
ఇరువది నలుగురు పెద్దల మధ్యలో
మహిమ ప్రభావముతో సింహాసనముపై
ఆసీనుడా యేసయ్య –
నా స్తుతి నీకేనయ్యా (2) || నాలో ఏమి ||
Naalo Emi Choochi Neevu | Hosanna Ministries New Song 2023 | Ps.Ramesh garu
Lyrics: English
Naalo Emi Choochi Neevu
Intha Prema Choopinavu (2)
Martyamaina Lokamandu
Nithyamaina Krupanu Choopi
Neti Varaku Thodundinavu
Yesayya Yesayya Naa Yesayya (2)
|| Naalo Emi ||
1. Naa Thalli Garbhamune Nanu Koritivi
Vishwasa Gruhamulo Nannu Cherchitivi (2)
Amruta Jalaina Nee Noti Maatalatho
Nikhila Jagatiki Nannu Pampinavu
Prakatimpa Nee Charitham –
Na Janma Nija Phalitham (2)
|| Naalo Emi ||
2. Ghanulaina Vaare Nee Yedhuta Nunnanu
Balamaina Vaare Endharo Unnanu (2)
Kanneela Kadalilo Shramala Sudululo
Naa Sthithi Choochi Nannu Cheradeesi
Marchitivi Nee Patrikaga –
Kadavaraku Nee Saakshiga (2)
|| Naalo Emi ||
3. Premaanuragam Nee Samskruthiye
Karuna Katakshamu Nee Gunasampadaye (2)
Naligina Rellunu Viruvanivada
Chitikina Brathukunu Viduvanivada
Naa Paina Neekenduko –
Ee Thagani Vaathsalayamu (2)
|| Naalo Emi ||
4. Dhavalavarnudavu Ratnavarnudavu
Varnanakandani Atisundarudavu (2)
Iruvadhi Naluguru Peddala Madhyalo
Mahima Prabhavamutho Simhasanamupai
Aaseenuda Yesayya –
Naa Stuthi Neekenayya (2)
|| Naalo Emi ||
Naalo Emi Song Audio