నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical
అద్వితీయుడా Album – 2023
నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
నా ప్రార్థన విజ్ఞాపనా నిత్య మహిమలో నిలవాలని (2)
అక్షయుడా నీ కలువరి త్యాగం –
అంకితభావం కలుగ జేసేను
ఆశల వాకిలి తెరచినావు –
అనురాగ వర్షం కురిపించినావు (2)
నా హృదయములో ఉప్పొంగేనే
కృతజ్ఞతా సంద్రమే
నీ సన్నిధిలో స్తుతి పాడనా
నా హృదయ విద్వాంసుడా ||నా కోరిక ||
1. యదార్ధ వంతుల యెడల
నీవుయెడబాయాక కృప చూపి
గాఢాందకారము కమ్ముకొనగా
వెలుగు రేఖవై ఉదయించినావు (2)
నన్ను నీవు నడిపించి నావు –
ఇష్టుడనై నేనడచినందున
దీర్ఘాయువుతో తృప్తిపరిచిన –
సజీవుడవు నీవెనయ్యా || నా హృదయ ||
2. నాలో ఉన్నది విశ్వాస వరము
తోడై యున్నది వాగ్దాన బలము
ధైర్య పరచి నడుపుచున్నది
విజయసిఖరపు దిశగా (2)
ఆర్పజాలని నీ ప్రేమతో –
ఆత్మ దీపము వెలిగించినావు
దీనమనస్సు వినయభావము –
నాకు నేర్పిన సాత్వీకుడా || నా హృదయ ||
3. స్వఛ్చమైనది నీవాక్యం
వన్నెతరగని ఉపదేశం
మహిమగలిగిన సంఘముగా నను
నిలుపునే నీ యెదుట (2)
సిగ్గు పరచదు ననెన్నడూ –
నీలో నాకున్న నిరీక్షణ
వేచియున్నాను నీ కోసమే –
సిద్ధపరచుము సంపూర్ణుడా || నా హృదయ ||
Naa Korika Nee Pranaalika Parimalinchalani | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical in English
Adviteeyuda Album – 2023
Naa Korika Nee Pranaalika Parimalinchalani
Naa Prardhana Vignapanaa Nitya Mahimalo Nilavalani (2)
Akshayudaa Nee Kaluvari Thyagam –
Ankitabhaavam Kaluga Jesenu
Aashala Vaakili Therachinavu –
Anuraaga Varsham Kuripinchinavu (2)
Naa Hrudayamulo Uppongeney
Kruthagnatha Sandrame
Nee Sannidhilo Stuthi Paadanaa
Naa Hrudaya Vidwamsudaa
||Naa Korika||
1.
Yadhaardha Vanthula Yedhala
Neevu Yedabayaka Krupa Choopi
Gadhandhakaaramu Kammukonaga
Velugu Rekhavai Udayinchinavu (2)
Nannu Neevu Nadipinchi Naavu –
Ishtudani Nenaadachinanduna
Deerghayuvutho Thripthiparinchina –
Sajeevudu Neevenayya
||Naa Hrudayamulo||
2.
Naalo Unnadi Vishwasavarhamu
Thodai Unnadi Vaagdana Balam
Dhairya Parachi Nadupuchunnadi
Vijayasikharapu Dishaga (2)
Aarpajalani Nee Prematho –
Aatma Deepamu Veliginchinavu
Deenamanassu Vinayabhaavamu –
Naaku Nerpincha Saathwikudaa
||Naa Hrudayamulo||
3.
Swachchamainadi Nee Vaakyam
Vannetharagani Upadesam
Mahimagaligina Sanghamuga Nanu
Nilupunee Nee Yedhuta (2)
Siggu Parachadu Nanennadoo –
Neelo Naakunna Nireekshana
Vechiyunnanu Nee Kosame –
Siddhaparachumu Sampurnudaa
||Naa Hrudayamulo||
Naa Korika Nee Pranaalika Song Audio