మహిమనాధుడా | Bro Prakash | GOOD FRIDAY 2026 Christian song
Lyrics: Telugu
మహిమనాధుడా పూజార్హుడా యేసయ్య (2)
మహాత్మ్యముతో ప్రభావముతో విరజిల్లే ఓ సుందరుడా (2)
చితికిన దేహముతో నా భారము మోసితివా
చిందిన రుధిరముతో నా కలుషము బాపితివా
నిలువెల్ల కరిగిన స్నేహశీలివయ్య
// మహిమనాధుడా //
1. (ఈ) సౌఖ్యభోగాలలో తృప్తి ఉందని చూసి
ఏది రుచియో వెదకి లోకమాశించాను (2)
అతిక్రమమంతయు ఒప్పుకొనక దీవెనకై విరుచుకుపడ్డాను
భక్తుడనంటూ నాపై కురిసిన శిక్షల వివరణ కోరాను
నిన్ను నమ్మని అన్యజనులలో క్షేమము చూసాను
పొగరు కనులకు కమ్మియుండగా నిను నిందించాను
// చితికిన దేహముతో //
2. (నే) నీతిగా బ్రతుకుటలో అసమర్ధతను చూసి
ఏది మేలో వెదకి (నీ) త్రోవనే విడిచాను (2)
నీ అవసరమేమని గర్వముగ నేర్చిన విద్యతో అడిగాను
నువ్వంటూ ఉంటే కష్టమనునది ఎందుకని ప్రశ్నించాను
రక్షణ పొందితే పంజర పక్షనే వార్త చాటాను
మొండితనముతో తిరుగులాడుచూ నిను ద్వేషించాను
// చితికిన దేహముతో //
3. ఇతరులకు కలిగినవి (నే) రెప్పలార్పక చూసి
ఏది కొదువో వెదకి అడిగి విసికించాను (2)
కార్యములన్ని లేఖనాలకే పరిమితమని తర్కించాను
చేసిన ప్రార్థన ఏమౌతుందని వేదనలో నిలదీసాను
కోరుకున్నవి ఇవ్వలేదని సన్నిధి విడిచాను
కలిమి కలుగగ అహము చెరుపగ నిను ఎదురించాను
// చితికిన దేహముతో //
Mahimanadhuda | Bro Prakash | GOOD FRIDAY 2026 Christian song
Lyrics: English
Mahimanadhudaa poojarhudaa Yesayya (2)
Mahatmyamuto prabhavamuto virajille o sundarudaa (2)
Chitikina dehamuto naa bhaaramu mositiva
Chindina rudhiramuto naa kalushamu baapitiva
Niluvella karigina snehasheelivayya
// Mahimanadhudaa //
1 Charanam
(Ee) soukhyabhogalalo trupti undani choosi
Edi ruchiyo vedaki lokamaasinchaanu (2)
Atikramamantayu oppukonaka deevenakai viruchukupaddaanu
Bhaktudanantu naapai kurisina shikshala vivarana koranu
Ninnu nammani anyajanulalo kshemamu choosaanu
Pogaru kanulaku kammi undaga ninu nindinchaanu
// Chitikina dehamuto //
2 Charanam
(Ne) neetiga bratukutalo asamarthatanu choosi
Edi melo vedaki (nee) trovane vidichaanu (2)
Nee avasaramemani garvamuga nerchina vidyato adigaanu
Nuvvantu unte kashtam anunadi endukani prashninchaanu
Rakshana pondite panjara pakshine vaartha chaatanu
Monditanamuto tirugulaaduchu ninu dveshinchaanu
// Chitikina dehamuto //
3 Charanam
Itarulaku kaliginavi (ne) reppalaarpaka choosi
Edi koduvo vedaki adigi visikinchaanu (2)
Kaaryamulanni lekhanalake parimitamani tarkinchaanu
Chesina praarthana emautundani vedanalo niladeesaanu
Korukunnavi ivvaledani sannidhi vidichaanu
Kalimi kalugaga ahamu cherupaga ninu edurinchaanu
// Chitikina dehamuto //