ఇదిగో దేవా నా జీవితం | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4) || ఇదిగో ||
1. పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం || ఇదిగో ||
2. నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము || ఇదిగో ||
3. విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా || ఇదిగో ||
Idigo Devaa Naa Jeevitham | Telugu Christian Song Lyrics
Lyrics: English
Idigo Devaa naa jeevitham
Aapaadamastakam neekankitham (2)
Sharanam nee charanam (4)
// Idigo //
1. Palumaarlu vaidolaginaanu
Paraloka darshanamunundi
Viluvaina nee divya pilupuku
Ne taginatlu jeevinchanaiti (2)
Ayinaa nee prematho
Nannu daricherchinaavu
Anduke gaikonumu Devaa
Ee naa shesha jeevitham
// Idigo //
2. Nee paadamula chentha cheri
Nee chittambu neneruga nerpu
Nee hrudaya bhaarambu nosagi
Prarthinchi pani cheyanimmu (2)
Aagipoka saagipovu
Priyasutuniga pani cheyanimmu
Prathi chota nee saakshiga
Prabhuvaa nannundanimmu
// Idigo //
3. Visthaara panta polamu nundi
Kashtinchi pani cheya nerpu
Kanneetitho viththu manasu
Kalakaalam mari naaku nosagu (2)
Kshema kshaama kaalamainaa
Ninnu ghanaparachu batukunimmayya
Nashiyinche aathmalan
Nee dari cherchu krupanimmayya
// Idigo //