ఎరిగియున్నానయా | A R Stevenson | Christian Song
Lyrics: Telugu
ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని
మార్పులేని దేవుడ నీవని
మాట ఇచ్చి నెరవేర్చుతావని (2)
మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని
|| ఎరిగియున్నానయా ||
1. నను చుట్టుముట్టిన బాధలతో
నాహృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో
నా గుండె నాలో నీరైపోగా (2)
అక్కున నన్ను చేర్చుకుంటివే – భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే – నను ఓదార్చితివే
|| ఎరిగియున్నానయా ||
2. మించిన బలవంతుల చేతినుండి
తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలలనుండి
రక్షించిన హృదయనాధుడా (2)
నిరాశలో నన్ను దర్శించితివే – ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే – కృపను పంచితివే
|| ఎరిగియున్నానయా ||
ERIGIYUNNAANAYA | A R Stevenson | Christian Song
Lyrics: English
Erigiyunnaanayaa neekedi asaadhyamu kaadani
Telusukunnaanaa neevapudu melu chesthaavani
Maarpuleni Devuda neevani
Maata ichchi neraverchutaavani (2)
Maarani vaagdaanamulu maakoraku daachi unchinaavani
|| Erigiyunnaanayaa ||
1. Nanu chuttumuttina baadhalato
Naa hrudayam kalavarapadaga
Naa swanta janula nindalato
Naa gunde naalo neerai poga (2)
Akkuna nannu cherchukuntive – bhayapadakantive
Mikkuta premanu choopitive – nanu odaarcitive
|| Erigiyunnaanayaa ||
2. Minchina balavanthula chetinundi
Tappinchina Yesu Devudaa
Vanchanakaarrula valalanundi
Rakshinchina hrudaya naadhudaa (2)
Niraashalo nannu darshinchtive – aadarinchitive
Sajeevunigaa nannunchitive – krupanu panchitive
|| Erigiyunnaanayaa ||