దివ్యసఖుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము కాదే ఈనాటిది
ఏనాటికీ విడిపోదు విభుడా యేసయ్యా
కన్నీళ్లెన్ని కార్చినా పలికే గీతిక
దివ్యసఖుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా
చరణం 1:
మౌనరాగమే మధుర గానమై
మరుపురానిదై మదిలో నిలిచెగా
ఊహించని శోధనలే శృతిలయలు నేర్పినాయి
పలు శ్రమలు నడిపినాయి నీ ప్రేమ శిఖరానికి
ఏకాంత వేళలో ఏకాకిని కాకుండను
నా పాదములు జారక కాపాడే యేసయ్యా
సద్గుణ రాశివి నీవేనని స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను
చరణం 2:
నిండు మనసులో ప్రేమ దీపమై
మారు మనసుకై సత్య మార్గమై
పలికే ప్రేమ నీవై నీవు నాతోనున్నావు
నా హృదయ సీమ నీవే మహారాజుగా నిలిచావు
నీవు నా ముందుగా నడిచే కాపరిగా
నా చేయి పట్టి నడిపించే యేసయ్యా
సద్గుణ రాశివి నీవేనని స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను
చరణం 3:
రమ్యమైనది భాగ్యమైనది
నిత్యమైనది సరిపోల్చలేనిది
నీ మహిమ రాజ్యమందు సీయోను శిఖరమందు
నే పరవశించి పాడే గొప్ప భాగ్యమిచ్చినావు
నూతనమైనది ఎవరు పాడలేని శ్రేష్టమైన గీతం
నే పాడెద యేసయ్య సద్గుణ రాశివి నీవేనని