దేవ సంస్తుతి చేయవే మనసా | Telugu Christian Song Lyrics


Lyrics: Telugu

దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా
జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా
నా యంతరంగము
లో వసించు నో సమస్తమా || దేవ ||

1. జీవమా, యెహోవా నీకు
జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను
మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును
ఆ కారణముచే  || దేవ ||

2. చావు గోతినుండి నిన్ను
లేవనెత్తి దయను గృపను (2)
జీవ కిరీటముగ వేయును
నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును
ఆ కారణముచే  || దేవ ||

3. యవ్వనంబు పక్షిరాజు
యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా
మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా
ఆ కారణముచే  || దేవ ||

4. ప్రభువు నీతి పనులు చేయును
బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
విభుండు మార్గము తెలిపె మోషేకు
దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు
ఆ కారణముచే  || దేవ ||

5. అత్యధిక ప్రేమ స్వరూపి
యైన దీర్ఘ శాంతపరుండు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు
ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు
ఆ కారణముచే  || దేవ ||

6. పామరుల మని ప్రత్యుపకార
ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
భూమి కన్న నాకాసంబున్న
ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున
ఆ కారణముచే  || దేవ ||

7. పడమటికి తూర్పెన్తా ఎడమో
పాపములను మనకు నంత (2)
ఎడము కలుగజేసియున్నాడు
మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు
ఆ కారణముచే  || దేవ ||

8. కొడుకులపై తండ్రి జాలి
పడు విధముగా భక్తిపరుల (2)
యెడల జాలి పడును దేవుండు
తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు
ఆ కారణముచే    || దేవ ||

9. మనము నిర్మితమయిన రీతి
తనకు దెలిసియున్న సంగతి (2)
మనము మంటి వారమంచును
జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును
ఆ కారణముచే  || దేవ ||

10. పూసి గాలి వీవ నెగిరి
పోయి బసను దెలియని వన (2)
వాస పుష్పము వలెనె నరుడుండు
నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు
ఆ కారణముచే  || దేవ ||

11. పరమ దేవ నిబంధ నాజ్ఞల్
భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును
యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును
ఆ కారణముచే  || దేవ ||

 


Deva Samsthuthi Cheyave Manasaa | Telugu Christian Song Lyrics

Lyrics: English

Deva samstuti cheyave manasaa
Sreemantudagu Yehova samstuti cheyave manasaa
Deva samstuti cheyumaa naa
Jeevamaa Yehova Devuni
Paavana naamamu nuthinchumaa
Naa antharangamulo vasinchu no samasthamaa
// Deva //

1. Jeevamaa, Yehova neeku
Jesina mellan maruvaku (2)
Neevu chesina paathakambulanu
Manninchi jabbu
Leviyun lekunda jeyunu
Aa kaaranamuche
// Deva //

2. Chaavu gothinundi ninnu
Levanetthi dayanu krupanu (2)
Jeeva kireetamuga veyunu
Nee shirasu meeda
Jeeva kireetamuga veyunu
Aa kaaranamuche
// Deva //

3. Yavvanambu pakshiraaju
Yavvanambu valene krotta (2)
Yavvanambai velayunatluga
Melu ichchi needu
Bhavamunu santhrupthiparachunuga
Aa kaaranamuche
// Deva //

4. Prabhuvu neeti panulu cheyunu
Baadhithulaku nyaayamicchunu (2)
Vibhundu maargamu telipe Mosheku
Dana kaaryamulanu
Vippe Nishraayelu janamunaku
Aa kaaranamuche
// Deva //

5. Atyadhika prema swaroopi
Yaina deergha shaanthaparundu (2)
Nithyamu vyaajyambu cheyadu
Aa krupoonnathudu
Nee pai neppudu kopamunchadu
Aa kaaranamuche
// Deva //

6. Paamarulamani pratyupakaara
Prathi phalambul pampaledu (2)
Bhoomi kanna naakaasambunna
Etthundu daiva
Prema bhakti janulayanduna
Aa kaaranamuche
// Deva //

7. Padamatiki thoorpenta edamo
Paapamulanu manaku antha (2)
Edamu kalugajesi yunnadu
Mana paapamulanu
Edamugaane chesiyunnadu
Aa kaaranamuche
// Deva //

8. Kodukulapai tandri jaali
Padu vidhamuga bhakthiparula (2)
Yedala jaali padunu Devundu
Tana bhakthiparula
Yedala jaalipadunu Devundu
Aa kaaranamuche
// Deva //

9. Manamu nirmitamaina reethi
Tanaku delisiyunna sangathi (2)
Manamu manti vaaramanchunu
Gnaapakamu chesi
Konuchu karuna joopuchundunu
Aa kaaranamuche
// Deva //

10. Poosi gaali veeva negiri
Poyi basanu deliyani vana (2)
Vaasa pushpamu valene narudundu
Naru naayuvu thruna
Praayamu mana Deva krupa mendu
Aa kaaranamuche
// Deva //

11. Parama Deva nibandha naagnal
Bhakthitho gaikonu janulaku (2)
Nirathamunu krupa nilichi yundunu
Yehova neeti
Tharamula pillalaku nundunu
Aa kaaranamuche
// Deva //

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *