నీ కాలం ముగిసిందా లోకంలో |  Br. Anandpaul Principal CBT-Mudigonda | Telugu Chritian Song Lyrics


Lyrics: Telugu

నీ కాలం ముగిసిందా లోకంలో
నీ పాదం ఆగిందా దేవుని పనిలో
నీ గొంతే మూగబోయింద పలుకుటలో
నీ చూపే నిలిచిపోయిందా చూచుటలో 

ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా సేవకురాల
ఈ యాత్రలో నీ పాత్రనే ముగియించకా (2)
 || నీ కాలం ||
1. సూర్యుడు ఉదయించక ముందే నీవు మేలుకుంటావు
ప్రార్థించి ప్రభు మాట చదువుతు ధ్యానిస్తావు
లోకమంతా ద్వేషించిన అయినవారే అపహసించిన
ఆ దేవుని పలుకులని బోధిస్తూ వెళతావు
నీ నోటి ఆ దేవుని పలుకులే –
ఎన్నో ఆత్మల రక్షణకు బాటలే  (2)
         || ఇక సెలవని ||
2. దేవునికి ఇష్టమైన సేవ నీవు చేశావు
సంఘ భారం అంత మోస్తూ మాదిరి నీవైనావు
నీ భార్య పిల్లలకు బాధ్యతను పెంచావు
యేసులాగా బ్రతకకపోతే బ్రతుకు శూన్యం అన్నావు
కష్టాల కన్నీటి యాత్రలో –
దేవుని విడువక బ్రతికావు సేవలో (2)
     || ఇక సెలవని ||
3. ప్రభువు నందు మృతులంతా ఎంత గొప్ప ధన్యులు
దేవునికై మరణిస్తే ఆహ్వాన దూతలు
స్వాగతాలు పలుకుతు ముందర పరిశుద్ధ పెద్దలు
తీసుకుని వెళ్ళినారా పరదైసుకు దూతలు
భూలోక యాత్రను ముగించావా –
విశ్రాంతి పొందుటకు వెళ్ళావా  (2)
       || ఇక సెలవని ||


Nee kaalam mugisindaa lokamlo |  Br. Anandpaul Principal CBT-Mudigonda | Telugu Chritian Song Lyrics

Lyrics: English

Nee kaalam mugisindaa lokamlo
Nee paadam aagindaa Devuni panilo
Nee gonthe moogaboyinda palukutu lo
Nee choope nilichipoyindaa choochutu lo

Ika selavani vellechunnavaa oo sevaka
Ee yaathralo nee paatrane mugiyinchakaa (2)
          || Nee kaalam ||
1. Sooryudu udayinchaka mundee neevu melukuntavu
Praarthinchi Prabhu maata chadhuvutu dhyaanistavu
Lokamantaa dveshichina aayina vaare apahasinchina
Aa Devuni palukulu bodhistu veltavu
Nee noti aa Devuni palukule –
Enno aathmala rakshanaku baatale (2)
          || Ika selavani ||
2. Devuniki ishtamainaa seva neevu chesavu
Sangha bhaaram anta mostu maadiri neevainaavu
Nee bharya pillalaki baadhyatanu penchavu
Yesulaga bratkakapote bratuku shoonyam annavu
Kashtala kanniti yaathralo –
Devuni viduvakaa bratkavu sevilo (2)
          || Ika selavani ||
3. Prabhu nandu mrutulantaa enta goppa dhanyulu
Devunikai maraniste aahvaana doothalu
Swaagataalu palukutu mundara parishuddha peddalu
Theesukoni vellinaaraa paraadaisu doothalu
Bhuloka yaathranu muginchavā –
Vishraanti pondutaku vellavā (2)
          || Ika selavani ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *