నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా | Philliph Prakash | Christian Song lyrics
Lyrics: Telugu
నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా
నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా
నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా
నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా
నీ ప్రేమ లేకుంటే ఈ జన్మలేదయ్యా
గుండెనిండా నిండున్నావు ఓ నాయేసయ్యా
|| నీవు తప్ప ||
1. కష్టాలచెరలో చిక్కుకున్న నన్ను
నీ ప్రేమవరమే కురిపించినావు
ఈ లోకమంతా వెలివేస్తున్న
నీ ప్రేమ నాపై చూపించినావు
నీ అరచేతిలో నన్ను దాచినావయ్యా
నా చేయి విడువక నన్ను నడిపినావయ్యా
నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా
|| నువ్వంటూ ||
2. కన్నీటి అలలో మునిగిన నన్ను
నీ దివ్యకరమే అందించినావు
ఆ సిలువలోనే నీప్రాణమును
నను రక్షింప అర్పించినావు
నీ కృప నీడలో నన్ను కాచినావయ్యా
ఒక క్షణం వీడక కాపాడినావయ్యా
నాశ్వాసై నాధ్యాసై నువ్వుంటే చాలయ్యా
|| నువ్వంటూ ||
Neevu Thappa Naku Ilalo Evarunnarayya | Philliph Prakash | Christian Song lyrics
Lyrics: English
Neevu thappa naaku illalo evarunnaarayya
Nee prema kanna saati bhuvipi yedee ledayya
Nuvvantu lekunṭe ne bratukalenaayya
Nenu ila unnaannante nee dayenayya
Nee prema lekunṭe ee janmaledayya
Gundeninda nindunnaavu O naa Yesayya
|| Neevu thappa ||
1. Kashtaala cheralo chikkukunna nannu
Nee premavaramé kuripinchinavu
Ee lokamantaa velivestunna
Nee prema naapai choopinchinavu
Nee arachetilo nannu daachinaavaayya
Naa cheyyi viduvaka nannu nadipinaavaayya
Naa toḍai naa needai ventunte chaalayya
|| Nuvvantu ||
2. Kanniti alalo munigina nannu
Nee divyakaramé andinchinavu
Aa siluvalone nee praanamunu
Nanu rakshimpa arpinchinavu
Nee krupa needalo nannu kaachinaavaayya
Oka kshanam veedaka kaapaadinaavaayya
Naa shwaasai naa dhyaasai nuvvunte chaalayya
|| Nuvvantu ||