నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము | Telugu Christian Song Lyrics


నీ ముఖము మనోహరము
నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా
మనగలనా నిను వీడి క్షణమైన

1. నీవే నాతోడువై నీవే నాజీవమై
నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై
నను ఎన్నడు వీడని అనుబంధమై ||యేసయ్య||

2. నీవే నా శైలమై నీవే నాశృంగమై
నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు ||యేసయ్య||

3. నీవే వెలుగువై నీవే ఆలయమై
నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై
నను మైమరచి నేనేమి చేసేదనో ||యేసయ్య||

 


Nee Mukhamu Manoharamu Nee Swaramu Madhuryamu | Telugu Christian Song Lyrics in English

Nee Mukhamu Manoharamu
Nee Swaramu Madhuryamu
Nee Paadalu Aparanji Mayamu
Yesayya Naa Praana Priyudaa
Managalanaa Ninu Veedi Kshanamaina

1. Neeve Na Toduvai Neeve Naa Jeevamai
Naa Hrudilona Nilichina Jnapikavai
Anuvanuvuna Nee Krupa Nikshiptamai
Nanu Ennadu Veedani Anubandhamai ||Yesayya||

2. Neeve Naa Shailamai Neeve Naa Shrungamai
Naa Vijayanikey Neevu Bhujabalamai
Anukshanamuna Shatruvuku Pratyakshamai
Nanu Venudiyaneyaka Vennu Tattinavu ||Yesayya||

3. Neeve Veluguvai Neeve Aalayamai
Naa Nityatvamunaku Aadyantamai
Amaralokana Shuddhulato Parichyamai
Nanu Maimarachi Neneemi Chesedano ||Yesayya||

 

 

Nee Mukhamu Manoharamu Audio

Spread the love

2 thoughts on “నీ ముఖము మనోహరము”

  1. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతి దినము నన్ను దర్శించేను

    Please Add This Song

  2. నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం – Nee Premaa Entho Entho Madhuram
    pls add this song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *