మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical
అద్వితీయుడా Album – 2023
అద్వితీయుడా నన్నేలు దైవమా
వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యములను
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం
ప్రతిఫలింపజేయునే ఎన్నడూ
కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము
వర్ణించలేను స్వామీ నీ గొప్పకార్యాలను
నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా
1. ప్రతీ గెలుపు బాటలోన చైతన్యస్పూర్తి నీవై
నడిపించుచున్న నేర్పరీ
అలుపెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై
నను నిలువనీయ్యని వేళలో
హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా
జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై
తడి కన్నులనే తుడిచిన నేస్తం ఇలలో నీవే కదా!
యేసయ్యా.. ||మదిలోన||
2. నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగుజాడలలోనే
సంకల్పదీక్షతో సాగెదా
నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై
ఆశయాలదిగా నడిపెనే
నీ నిత్య ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతా తీర్చి నా సేద తీర్చితివి
నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకు సాక్షిగా!
యేసయ్యా.. ||మదిలోన||
3. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాతవు
స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైనవారికి ఫలములిచ్చు నిర్ణేతవు
ఆ గడియవరకు విడువకూ
నే వేచియున్నాను నీ రాక కోసమే
శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా
నా ఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా!
యేసయ్యా.. ||మదిలోన||
Madilona Nee Roopam Nee Nitya Sankalpam | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical in English
Adviteeyuda Album – 2023
Adwitheeyudaa Nannelu Daivamaa
Varninchalenu Swaami Nee Goppa Kaaryamulanu
Pallavi:
Madilona Nee Roopam Nee Nitya Sankalpam
Prathifalinchajeyune Ennadoo
Kalanaina Talanchalede Neelo Ee Saubhaagyamu
Varninchalenu Swaami Nee Goppakaaryamulanu
Nee Saati Leru Ilalo Adwitheeyudaa
Charanam 1:
Prathi Gelupu Baatalona Chaitanyaspoorthi Neevai
Nadipinchuchunna Nerpari
Aluperugani Porataale Uhinchani Uppenaalai
Nanu Niluvaneeyani Velalo
Hridayana Koluvaiyunna Ishrayelu Daivamaa
Jayamichchi Nadipinchitive Nee Khyaatikaai
Tadi Kannulane Tudichina Nestam Ilalo Neeve Kada!
Yesayyaa… ||Madilona||
Charanam 2:
Nirantaram Nee Sannidhilo Nee Adugujaadalalone
Sankalpadheekshatho Saagedaa
Neetho Sahajeevaname Aadhyaatmika Paravashamai
Aashayaladiga Nadipene
Nee Nitya Aadharanane Annitilo Nemmadi Nichchi
Naa Bhaaramantha Theerchi Naa Sede Theerchitive
Nee Aatmatho Mudrinchitive Nee Koraku Saakshigaa!
Yesayyaa… ||Madilona||
Charanam 3:
Vishwamantaa Aaradhinche Swarnarajya Nirmathavu
Sthaapinchumu Nee Prema Saamrajyamu
Shuddhulaainavaariki Phalamulichchu Nernethavu
Aa Gadiyavaraku Viduvaku
Nene Vechiyunnaanu Nee Raaka Kosame
Shreshtamainaa Swaasthyamu Kosam Siddhaparachumaa
Naa Oohalalo Aashala Saudham Ilalo Neevenayya!
Yesayyaa… ||Madilona||
Madilona Nee Roopam Song Lyrics
సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా
Please Add This Song
మాటే చాలయ్యా యేసయ్య
Please add this song