కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద (2)
నా పైన ప్రేమ చూపించి
నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వికుడా
నీ కోసమే నా జీవితం – (2)    ||కరుణా||

1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము
నా హృదయసీమలోనే సందడిని చేసెను (2)
అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే
ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను (2)
ఆ వాక్యమే ఆరోగ్యమై…
జీవింపజేసే నన్నే నడిపించెను      ||కరుణా||

2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని
ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని (2)
నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే
అనుదినము మకరందమే నీ స్నేహబంధము (2)
ఆ ప్రేమలోనే కడవరకు నన్ను…
నడిపించుమా స్థిరపరచుమా    ||కరుణా||

3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై
నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది (2)
నా కోసం నిర్మించే సౌందర్యనగరములో
ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం (2)
తేజోమయా నీ శోభితం…
నే పొందెద కొనియాడెద    ||కరుణా||

 


 

Karunasampannudaa Dheerudaa Sukumaarudaa
Nee Prabhava Mahimalane
Nirantaram Nenu Prakatincheda (2)
Naa Paina Prema Choopinchi
Naa Koraku Tyaagamaitive
Naa Yesayya Saathvikudaa
Nee Kosame Naa Jeevitam – (2)
|| Karunasampannudaa ||

1.
Eenadu Nanu Veedani Nee Prema Sandeshamu
Naa Hridayaseemalone Sandadni Chesenu (2)
Anuvanuvunu Balaparache Nee Jeevipa Vaakyame
Pratikshanamu Dari Cheri Nanne Taakenu (2)
Aa Vaakyame Aarogyamai…
Jeevimpajesenu Nanne Nadipinchenu
|| Karunasampannudaa ||

2.
Ee Vinta Lokamlo Nee Chenta Cheritini
Enaleni Prematone Aadarana Ponditini (2)
Nee Krupalo Nilipinadi Nee Premabandhame
Anudinamu Makarandame Nee Snehabandhamu (2)
Aa Premalone Kadavarakunu Nannu…
Nadipinchuma Sthiraparachuma
|| Karunasampannudaa ||

3.
Ne Vechiyunnanu Nee Mahima Pratyakshatakai
Naakunna Ee Nireekshane Sannidhilo Nilipinadi (2)
Naa Kosam Nirmisey Soundaryanagaramulo
Pranamilli Chesedanu Nee Paadaabhivandanam (2)
Tejomayaa Nee Shobhitham…
Ne Pondeda Koniyadeda
|| Karunasampannudaa ||

 

 

 

Karunasampannudaa Song Audio

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *