ఆరాధింతు ఆత్మరూప – ఆత్మతో సత్యముతో | Old Telugu Christian Song Lyrics
ఆరాధింతు ఆత్మరూప
ఆత్మతో సత్యముతో (2)
నేను నిన్ను స్తోత్రించుటకు
నీవె కారణభూతుడవు (2)
1. ఊరి వెలుపలగా నే నుంటి
దారి ప్రక్కను పడియుంటి (2)
ఘోర వ్యాధితో బాధ పడగా
చేరి నను కరుణించితివి (2) ||ఆరాధింతు||
2. నాదు పెదవులు అపవిత్రములు
నాదు పాదములపవిత్రం.. (2)
కొంత కాదు కొన్ని కాదు
మొత్తమంతా దోషములే (2) ||ఆరాధింతు||
3. ఇష్టపడితివి నను రక్షింప
కష్టపడితివి కలువరిలో (2)
శుద్ధికలుగుట చూడగానే
బుద్ధి కలిగెను స్తుతియింప (2)||ఆరాధింతు||
4. దంచి విసరి నలిపి కాల్చ
రొట్టె యాయెను గోధుమలు (2)
అట్టి నీదు దేహమునకు
రొట్టెనిడితివి సూచనగా (2) ||ఆరాధింతు||
5. నాదు చేదును త్రాగిన వాడ (యేసు)
క్రోధ పాత్రను త్రాగితివా (2)
రక్త గుర్తుగా పాత్రనుంచినా
మధుర ప్రేమకు స్తోత్రములు (2) ||ఆరాధింతు||
Aaraadhinthu Aathmaroopa Aathmatho Sathyamutho| Old Telugu Christian Song Lyrics in English
Aaraadhinthu Aathmaroopa
Aathmatho Sathyamutho (2)
Nenu Ninnu Stothrinchataku
Neeve Kaaranabhootudavu (2)
1. Oori Velupalaga Nee Nunti
Daari Prakkana Padiyunti (2)
Ghora Vyadhitho Baadha Padaga
Cheri Nanu Karuninchitivi (2)
||Aaraadhinthu||
2. Naadu Pedhavulu Apavithramulu
Naadu Paadamula Pavithram (2)
Kontha Kaadu Konni Kaadu
Moththamantha Doshamule (2)
||Aaraadhinthu||
3. Ishtapaditivi Nanu Rakshimpa
Kashtapaditivi Kaluvurilo (2)
Shuddhikaluguta Choodagaane
Buddhi Kaligenu Stuthiyimpa (2)
||Aaraadhinthu||
4. Danchi Visari Nalipi Kaalcha
Rottayainu Godhumalu (2)
Atti Needu Dehamunaku
Rottaniditivi Suchanaga (2)
||Aaraadhinthu||
5. Naadu Chedunu Thragina Yeshu
Krodha Paathranu Thragitivaa (2)
Rudhira Chihnam Paathralonidhi
Madhuramagu Premaku Stothram (2)
||Aaraadhinthu||
Aaraadhinthu Aathmaroopa Audio