నిన్ను మరచి నేను ఉండలేనయ్యా
నిన్ను విడచి నేను బ్రతకలేనయ్యా
బ్రతకలేనయ్యా… బ్రతకలేనయ్యా…
బ్రతకలేనయ్యా…
ఒక క్షణమైనా…… ఒక గడియైనా
నీవు లేక బ్రతుకలేనయ్యా (2)
1. తల్లిదండ్రులే నన్ను వెలివేసినా
అన్నదమ్ములే నన్ను త్రోసేసినా (2)
నా అనువారే దూరమైన
నా బంధువై నా స్నేహితుడై
నన్ను చేరదీశావయ్యా నా……. యేసయ్య (2)
// ఒక క్షణమైనా //
2. కష్టాల కొలిమిలో కృంగిన నన్ను
నష్టాల ఊబిలో నలిగిన నన్ను (2)
ఏ ఆధారమే లేని నాకు
నా ఆధారమై నా ఆశ్రయమై
నన్నాదుకొన్నావయ్యా నా……… యేసయ్య (2)
// ఒక క్షణమైనా //
3. శ్రమలెన్నో నన్ను చుట్టుముట్టిన
ఆపదలో నన్ను ఆవరించిన (2)
ఏ ఆనందమే లేని నాకు
నా ఆనందమై నా ఆశీర్వాదమై
నన్నాదరించవయ్యా నా………. యేసయ్య (2)
// ఒక క్షణమైనా //